Essay on Parrot in Telugu Language : In this article, we are providing తెలుగు భాషలో చిలుకపై వ్యాసం and Parrot Essay in Telugu for Students.
Essay on Parrot in Telugu Language : In this article, we are providing తెలుగు భాషలో చిలుకపై వ్యాసం and Parrot Essay in Telugu for Students.
Essay on Parrot in Telugu Language
తెలుగు భాషలో చిలుకపై వ్యాసం : రామచిలుక ఎంతో అందమైన పక్షి. ఆకుపచ్చని చిలుకలు ఎన్నో మనం రోజూ చూస్తుంటాం. బలే చక్కగా ఉంటాయి కదూ. వాటిని చూడగానే మన మనస్సు లోని కలకలం అంతా ఎగిరిపోతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు రామచిలుకలు ఎంతో నచ్చుతాయి.
కొన్ని రామచిలుకలు ఎర్రరంగు, ఆకుపచ్చ రంగులు కలిసి ఉంటాయి. కొన్ని బూడిద రంగు, నీలం, పసుపు రంగుల్లోకూడా కనిపిస్తాయి. కొన్నిటికి తలపైన కిరీటం లాగా కూడా ఉంటుంది. రామచిలకలు ఎంతో తెలివైన పక్షులు. మన మాటలని, రకరకాల శబ్దాలని అనుకరిస్తాయి. చిలుకల కిలకిలారావాలు, కిచ్ కిచ్ లు వినసొంపుగా ఉంటాయి. చిలుకలని ఎంతోమంది చిన్న చిన్న మందిరాలలో పెట్టి తమ ఇండ్లలో పెంచుకొంటారు. చిలకలు పదిహేను నుండి ఇరవై సంవత్సరాలు బ్రతుకుతాయి. ఆఫ్రికా ఖండంలో అయితే పెద్ద పెద్ద చిలుకలుంటాయి.
రామచిలుకలు చాలవేగం గా ఎగురుతాయి. కానీ చాలా ఎక్కువ ఎత్తుకి ఎగరలేవు. మామిడిపండ్లు, జామ పండ్లు, అన్నం, పప్పులు, బియ్యం, జీడిమామిడి పండ్లు , ఆకులు రేగు పండ్లు , వాటి అన్నిటిలోని గింజలు ఇష్టం గా తింటాయి. చిలుకలని మనం పెంపుడు పక్షుల దుకాణం లో కొనవచ్చు.
రామచిలుకలు చెట్ల తొర్రల్లో, కొమ్మల మధ్యలో గూడు కట్టుకొని నివాసం ఉంటాయి. అందులో గుడ్లు పెట్టి అవి పొదిగి పెద్దవైయ్యెదాకా వాటిని రక్షించి ఆ తరవాత వాటిని ఆకాశం లో కి ఎగరడం నేర్పుతాయి. గుంపు గుంపులు గా ఎగురుతాయి కూడా. ప్రపంచం లో మూడు వందల రకాల పైగా చిలుకలున్నాయి. చిలుకా గోరింకా జంటల గురించి కవులు పాటల్లో ఎంతో చక్కగా రాస్తారు. చూడ చక్కనైన జంటని చిలుక గోరింక లతో పోలుస్తారు కదా.
మన అందరి వినోదం కోసం రామచిలుకలని సర్కస్ లో ఆట పాటలలో శిక్షణ ఇచ్చి ప్రదర్శన చేయిస్తారు. జూ లో పెంచుతారు కూడా, చూసారా ఎపుడైనా ? అవి సైకిలు తొక్కి , పల్టీలు కొట్టి బలే తమాషా చేస్తాయి. కొన్ని రామచిలుకలు వందల శబ్దాలు గుర్తుంచుకోగలవు. ఆఫ్రికా లోని అమెజాన్ ప్రాంతం లో ని చిలుకలు మంచి తెలివి, జ్ఞ్యాపక శక్తి కలవి.
పక్షులను సంరక్షించడం మన ధర్మం. అది గుర్తుంచుకొందాం.
COMMENTS