విక్రమార్క భేతాళుడు చెప్పిన ఆరో కథ : Read Vikram Betal Sixth Story in Telugu Language, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids.
విక్రమార్క భేతాళుడు చెప్పిన ఆరో కథ : In this article, read Vikram Betal Sixth Story in Telugu Language, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids and Students.
విక్రమార్క భేతాళుడు చెప్పిన ఆరో కథ Vikram Betal Sixth Story in Telugu
మగధదేశంలో విశాలహృదయుడనే సంపన్నుడున్నాడు. అతనికి కమలాక్షి అనబడే కూతురువుంది. ఆమె బహుఅందగత్తె. కృపాకరుడు అనబడే యువకుడు ఆమెతోపోటీ చేయగల అందగాడు. అతను ఒకానొక సమయంలోని కమలాక్షిని, అమె అందాన్ని చూసి ముగ్ధుడు అయినాడు. అతను సిరిసంపదల్లో గానీ, నడతలోకానీ ఆమెకు అన్నివిధాలా తగినవాడని అతని నమ్మకం. ఒకనాడు అతను ధనికునివద్దకు వెళ్ళాడు. “అయ్యా ! నేను సాటి కులస్తుడను, ధనవంతు డను, మీకు సరితూగుతాను.
సమాన స్థితిపరుడనే కాని తక్కువేం కాదు. మీ అమ్మాయిని నేను చూశాను. మనస్సు ఆమెనే కోరుతోంది. అమెనే పెళ్ళాడాలన్న తలంపుతో మీ దర్శనంచేసుకున్నాను. మీరు దయతో మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్ళిచేయండి! కాదంటే మీ ఎదుటనే నాప్రాణాన్ని పరలోకానికి పంపేస్తాను” అని వేడుకున్నాడు.
కమలాక్షి స్థితిగతులు ముందుగా తెల్సుకొనే అతను ఆ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పాడు.
“అబ్బాయ్ ! తొందరపడకుండా నేను అమ్మాయితో నీగురించి చెప్పి ఆమె ఒప్పుకుంటే పెళ్ళిచేస్తాను మీ ఇద్దరికీ! రెండు రోజులు అనంతరం చెప్ప గలను” అని అన్నాడు ఆ ధనవంతుడు.
"అయ్యా! తమ పేరులోనే వుంది దయగలవారని. తమపేరు విశాలహృద యుడు అని తెలియగానే అని చెప్పాడు. కృపాకరుడు వెళ్ళిన కొద్ది సేపటికే మరొక ధనవంతుని కుమారుడు వచ్చాడు. కృపాకరుడు మాదిరిగానే విశాలహృ దయునికి చెప్పి “తమకుమార్తెను నాకిచ్చి పెళ్ళిచేయండి ! నాకిచ్చి పెళ్ళిచేయ కుంటే మీ ఎదుటనే మరణించుతాను” అని చెప్పాడు. అప్పుడు విశాలహృద యుడు కృపాకరుకునికి చెప్పిన మాటల్నే చెప్పి పంపివేశాడు.
ఆ ఇద్దరి మాదిరే ఆ మర్నాడు ఉదయం జీవసిద్ధి అనే అతను వచ్చి విశాలాక్షిని తనకిచ్చి పెళ్ళిచేయమని కోరాడు. విశాలహృదయుడు అతనికి కూడా కృపాకరునికీ, ధనగుప్తునికి చెప్పినవిధంగానే చెప్పి పంపివేశాడు.
ఆ తదుపరి విశాలహృదయుడు కుమార్తె కమలాక్షిని కల్సుకున్నాడు. అమ్మాయీ! ముగ్గురు ధనవంతుల బిడ్డలువచ్చారు నిన్ను పెళ్ళాడేటందుకు నువ్వు వారలనుచూసి నీ అభిప్రాయం వెల్లడించు” అని అడిగాడు విశాలహృదయుడు.
కానీ, ఆ రాత్రే అనుకోకుండా కమలాక్షి చనిపోయింది. యీ సంగతి ముగ్గురు వీరులకూ తెలిసింది. ఆ వెంటనే వారి ఇంటికివచ్చారు. కమలాక్షి శవాన్ని చూసి మిక్కిలి దుఖించారు.
తదనంతరం కృపాకరుడు తను మెచ్చిన కమలాక్షికి దహనసంస్కారం చేశాడు. అంతేగాకుండా స్మశానంలోనే ఆమెను దహనం చేసినచోట చిన్న కుటీరం ఏర్పడుకుని అందులోనివసిస్తున్నాడు. ఈ
కమలాక్షి యొక్క అస్తికలను తీసుకువెళ్ళి పుణ్యనదులలో కలిపాడు ధనగుప్తుడు తక్షణం వెళ్ళిపోయాడు.
పోతే జీవసితి బ్రతుకుమీద విరక్తి కలిగింది. సన్యాసిగా మారిపోయాడు. అతను వీధులుపట్టి తిరిగే ఆలోచనతో బయల్దేరి వెడుతున్నాడు. అప్పుడు అతనికి అనుకోకుండా సిద్ధపురుషుడు కనిపించాడు. ఆయనకు తను సన్యాసి అవడానికి గల కారణంను విశదీకరించాడు జీవసిద్ది.
సిద్ధపురుషుడు అనుగ్రహించి యింత విభూది యిచ్చాడు. ఆ వీభూది చనిపోయినవారి మీద చల్లాలి. అప్పటికే వారు అగ్నిమయమైతే చితిమీద చల్లాలి. అప్పుడు చనిపోయినవారు తిరిగి బ్రతికే అవకాశంవుంది. అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ మరుక్షణం జీవసిద్ది కమలాక్షిని దహనం చేసినచోటునకు వెళ్ళాడు, కృపాలుడు అక్కడనే ఆశ్రమంను ఏర్పాటుచేసుకొని వున్నాడు కదా ! అస్తికలు కలిపేటందుకు వెళ్ళిన ధనగుప్తుడూ అక్కడకు అప్పుడేవచ్చాడు.
అప్పుడు ఆ ముగ్గురూ కలిసి కాలిమసిగా మిగిలినచితిని పోగుచేశారు. దానిమీద సిద్ధపురుషుడు యిచ్చిన వీభూదిని చల్లాడు జీవసిద్ది ఆ మరుక్షణం కమలాక్షి నిద్రనుండి మేల్కొనినట్లుగా లేచి కూర్చున్నది. ఆ ముగ్గురువరులూ కమ లాక్షి తనకేదక్కాలని వాదించుకుంటున్నారు. ఇదీకథ! ఇప్పుడుచెప్పు విక్రమార్కా”
కమలాక్షి ఆ ముగ్గురిలో ఎవరికి భార్య అయితే న్యాయంగా వుంటుంది? అని ప్రశ్నించాడు.
విక్రమార్కుడు ఆలోచించాడు. “కృపాకరుని భార్య అయితేనే బాగుంటుంది” అని చెప్పాడు.
“అదే సమ్మతమని కమలాక్షి ఆలోచించి ఆవిధంగానే పెళ్ళి చేసుకుంది. ఎందువలన ?” అడిగాడు భేతాళుడు.
"తనకు పునర్జీవితం ప్రసాదించిన జీవసిద్ధుని తండ్రిగా భావించింది. తన అస్తికలు పుణ్యనదుల్లో కలిపి వచ్చిన ధనగుప్తుని కుమారుడుగా తలచింది. తనకొరకు రాత్రింబవళ్లు ఆస్మశానం నందేవుండి అక్కడే నివాసం యేర్పర్చుకొని కాపురంవుంటున్న కృపాకరుడునే భర్తగా స్వీకరించింది”అని చెప్పాడు విక్రమార్కుడు.
ఆ తక్షణం భేతాళుడు మౌనభంగ కారణంగా అతని భుజం నుండి ఎగిరి ఆమరుక్షణంలో మర్రివృక్ష కొమ్మను చేరాడు. ఎప్పటి మాదిరే విక్ర మార్కుడు వెనుతిరిగి మర్రివృక్షం వద్దకు వెళ్ళి భేతాళుని అందుకొని భుజాన వేసుకొని బయల్దేరాడు. భేతాలుడు ఆగకుండా మరోకథను మొదలు పెట్టాడు.
COMMENTS