విక్రమార్క భేతాళుడు చెప్పిన ఏడవ కథ : Read Vikram Betal Seventh Story in Telugu Language, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids.
విక్రమార్క భేతాళుడు చెప్పిన ఏడవ కథ : In this article, read Vikram Betal Seventh Story in Telugu Language, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids and Students.
విక్రమార్క భేతాళుడు చెప్పిన ఏడవ కథ Vikram Betal Seventh Story in Telugu
ఆ కాలంలో వింధ్యారణ్య ప్రాంతంలోగల ఒక ఊరినందు వేదశర్మనే బ్రాహ్మణుడు నివసించుచున్నాడు. అతను చుట్టుప్రక్కలవున్న గ్రామంలోని వార్కి తిథి, వార, నక్షత్రాలుబట్టి వారికి అవసరమైన కార్యాలకు ముహూర్తాలు పెడుతూ ఆ వచ్చిన పారితోషికంతో జీవితం గడుపుకుంటున్నాడు.
సుశీల వేద శర్మ భార్య. ఈ దంపతులకు చాలా కాలానికి ఒక కుమా రుడు గలిగాడు. ఆ దంపతులు ఆబాలుని ప్రాణప్రదంగా పెంచుకుంటున్నారు. పరిగెత్తే కాలంలో ఆ బాలుడు తప్పటడుగులు వేసేవయస్సుకి వచ్చాడు. వేదశర్మ ఎప్పుడూ చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్ళి వస్తుండడమే జీవనోపాధికి మార్గం. ఒకనాడు వేదశర్మ ప్రక్కగ్రామానికి వెళ్ళి తిరిగి వస్తుండగా చీకటి పడింది. అయినా వేదశర్మ ఇంటికి వెళ్ళితీరాలి. మర్నాడు పొయ్యిమీదకు గిన్నె ఎక్కాలంటే అతను వెళ్ళాలి వెళ్ళాలంటే ఆతనికి తోడుకావాలి. తోడుగా అతనితో నడవడానికి ఎవ్వరూకనిపించలేదు. అందువల్లదైవంమీదభారంవేసిబయలుదేరి వెడుతున్నాడు.
మార్గమధ్యంలో ఆ బ్రాహ్మణుడు వేదశర్మకు బ్రహ్మరాక్షసుడు ఎదురై ఆగమన్నాడు.
బ్రాహ్మణుడు భయపడి ధైర్యం కూడదీసుకొని ఆగాడు. “ఏమిటి ?" అని అడిగాడు.
“నాకు ఆకలిగావుంది. నరమాంసంకోసం అడివిని పట్టి తిరుగు తున్నాను. నాశ్రమఫలించింది. నువ్వు కంటపడ్డావు” అని వికటంగానవ్వి. అతని మీదకురికాడు.
వేదశర్మ తప్పించుకున్నాడు. ఆ రాక్షుసుడుని చూడగానే ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లు అనిపించింది. అతను భయకంపితుడు అయినాడు. చేతులు జోడించి నమస్కరించి యిలా అన్నాడు.
“రాక్షసవీరా ! నీ చేతికి చిక్కిన వాడిని నీ నుండి తప్పించుకుని ఎక్కడికి పోగలవు ? నీకుఆహారంగా వెళ్ళడం నా ధర్మం! అయితే చావకముదు చివరి కోరిక తీర్చాలికదా ! అది నీ ధర్మం కదా అని అన్నారు.
రాక్షసుడు ఘడియ సేపు ఆలోచించి అంగీకరించారు “సరే ఏమిటో అడుగు! “తీరుస్తాను !” అన్నాడు.
“అ తదుపరి నీకు యిష్టం లేకపోతే ? ముందు తీరుస్తానని వాగ్దానం చెయ్యి” అంటూ చేతిని జాచాడు బ్రాహ్మణుడు. రాక్షసుడు ఆ బ్రాహ్మణుడను తేరిపార చూశాడు. “నీ ప్రాణాలు మినహా యేదైనా కోరుకో తీరుస్తాను” అని చేతిలో చెయ్యినివేశాడు.
'రాక్షస వీరా ! మా నివాసం ఇక్కడికి సమీపానే వుంది. నాకు నాభార్య మాత్రమేగాక లేకలేక కలిగిన రెండేళ్ళ కుమారుడున్నాడు. నాభార్య పేరు సుశీల. ఆ ఇద్దరూ తప్ప నాకు మా ఇంట్లో ఎవ్వరూ లేరు ఒకసారి ఆ ఇద్దర్ని చూసి వస్తాను” అని అడిగాడు.” నేను తెల్లారేలోపుగానే తిరిగివచ్చి నీకు నా ప్రాణాలను అర్పించుతాను. నాభార్య మహాసాధ్వి ! నేను చెప్పింది కాదనే అలవాటు లేనిది! చూడడమేగాక వాళ్ళను వాళ్ళు నేచస్తే బ్రతకలేరు కనుక, బంధువుల ఇంటికి పొమ్మని చెప్పివస్తాను.” అని అన్నాడు. “నిన్ను వదిలితే నువ్వు తిరిగివస్తావా” అయినా నేను వాగ్దానం చేశాను ! వెళ్ళారా ! నీ మీద నమ్మకంతో వదులుతాను నువ్వు తిరిగి వచ్చే వరకూ యిక్కడేవుంటాను” అని చెప్పి బ్రాహ్మణుడ్ని పంపివేశాడు రాక్షసుడు.
వేదశర్మ ఇంటికి వెళ్ళాడు. “సుశీలా! నువ్వు మహాసాద్వివి. నేను అంద రికీ ప్రాణంపోయినా అబద్దమాడకూడదని చెప్తుండేవాడిని ! ఇప్పుడు నాకు ప్రాణం మీదకు వచ్చింది" అంటూ రాక్షసునికీ తనకూ జరిగిన కథను వివరించారు.
“ఇది నాకు భగవంతుడు పెట్టిన పరీక్ష ! నేను రాక్షసునివద్దకు వెళ్ళేందుకు సంతోషంతో అంగీకరించు ! నువ్వు బాబుని తీసుకొని పుట్టింటికి వెళ్ళు ! మిమ్మల్ని భగవంతుడే రక్షించుతాడు” అని చెప్పాడు. తదుపరి బాధను అనుభవిస్తున్న భర్త మాట నిలబెట్టుకోవాలని తలచి అతను చెప్పిన దానికి అంగీకరించి అతన్ని రాక్షసుని వద్దకు పంపేసింది. ఆ తదుపరి వేదశర్మ తిన్నగా రాక్షసుడువున్న ప్రదేశానికి వెళ్ళాడు.
వేదశర్మను చూసి రాక్షసుడు మిక్కిలి అనందించాడు.
“బ్రాహ్మణోత్తమా ! నీ సత్యశీలానికి, నేను ఎంతో ఆనందిస్తున్నాను. నీవంటి సత్ బ్రాహ్మణులు యింకా యీలోకంలో వుండబట్టే త్రిమూర్తులు కూడా హర్షిస్తున్నారు. నీ వంటి విశాల హృదయుడునీ, పూజ్యుడునీ చంపితిని నేను నరకానికి పోలేను. నిన్ను వదలేస్తున్నాను. నీవు తిరిగి మీ ఊరు వెళ్ళి ఆలుబిడ్డలతో సుఖశాంతులతో బ్రతుకు”. అంటూ తన వద్ద వున్న అమూల బంగారాన్ని ఇచ్చాడు రాక్షసుడు.
"విక్రమార్క భూపాలా ! కథను చెప్పడం అయిపోయింది. ఇప్పుడు చెప్పు ఇందులో బ్రాహ్మణుడు వేదశర్మ గొప్పవాడా? లేక రాక్షసుడు గొప్పవాడా ?” అని అడిగాడు భేతాళుడు. .
విక్రమార్కుడు ఆలోచించాడు.
“భేతాళా ! బ్రాహ్మణుడు స్వార్థంను కోరినవాడు, బ్రహ్మరాక్షసుడు నరమాంస భక్షకుడు అయినా ఆకలి దంచేస్తున్నా, తన స్వార్ధం కోసం కాకుండా మాటనిలబెట్టుకున్నాడని బ్రాహ్మణుని విడిచివేశాడు. అంతేకాకుండా ముందు తరాలకు కూడా అతను సుఖంగా బ్రతికేటందుకు బంగారుంను ప్రసాదించాడు. కనుక రాక్షసుడే గొప్పవాడు” అని చెప్పాడు విక్రమార్కుడు.
ఈ విధమైన మౌనభంగంతో భేతాళుడు ఎప్పటిలాగే ఎగిరి అతని నుండి తప్పించుకుని తన నివాసానికి చేరి కొమ్మకు వ్రేలాడుతున్నాడు.
విక్రమాదిత్యుడు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి అతన్ని స్వాధీనం చేసుకొని భుజానవేసుకొని సన్యాసి దగ్గరకు వెళుతున్నాడు. భేతాళుడు మాట్లాడకుండా వూరుకున్నాడా ? మరో కథను చెప్పడం మొదలు పెట్టాడు.
COMMENTS