విక్రమార్క భేతాళుడు చెప్పిన నాల్గవ కథ : Read Vikram Betal Fourth Story in Telugu, "బేతాళ కథలు", "Bhetaludu Cheppina Nalgava Katha Telugu" for Kids.
విక్రమార్క భేతాళుడు చెప్పిన నాల్గవ కథ : In this article, read Vikram Betal Fourth Story in Telugu Language, "బేతాళ కథలు", "Bhetaludu Cheppina Nalgava Katha Telugu" for Kids and Students.
విక్రమార్క భేతాళుడు చెప్పిన నాల్గవ కథ Vikram Betal Fourth Story in Telugu
ఒకప్పుడు జీమూతకేతు అనే విద్యాధరపురరాజు వుండేవాడు. అతని కోరిక లను ఎప్పటికప్పుడు తీర్చు కల్పవృక్షం ఉండేది. ఆ కల్పవృక్షం వలన తన రాజ్యం సుభిక్షంగా వుండేటట్లు చేసుకున్నాడు. అతను విష్ణు భక్తుడు కూడ, చాలాకాలానికి విష్ణు దేవుని అనుగ్రహిం వలన అతనికి జీమూత వాహ నుడు అనబడే కుర్రవాడు పుట్టాడు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగు తున్నాడు. తండ్రి ఆశ యాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ వుండేవాడు. ఆతనికి యుక్తవయస్సు వచ్చివుండుటవలన ఆతన్ని గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు రాజు జీమూత వాహనుడు! సమస్త ప్రాణులూ సుఖంగావుండాలని కోరుకునే వాడు. ఇలా జరుగుతుండగా జీమూత కేతువు కుమారుడు అయిన జీమూత వాహనునికి విద్యాధరరాజ్యంనకు అధిపతిని చేశాడు. ఆ తక్షణం తను భార్యతో సహా అడవికి వెళ్ళిపోయాడు.
జీమూతవాహనుడు అహింసావాది ! యీ రహస్యాన్ని కనిపెట్టారు శత్రురాజులు. అది అదనుగా తీసుకొని విద్యాధర రాజ్యంపైకి దండయాత్రను సాగించారు. సమస్త శాస్త్రాల్లోనూ పండితుడు అయిన జీమూత వాహనుడు ప్రాణహింసకు పాల్పడక, శత్రువులను జయించే శక్తికలవాడు అయినప్పటికీ యుద్ధం చేసి ప్రాణనష్టం కలిగించేటందుకు ఇష్టపడక రాజ్యాన్ని శత్రువులకు అప్పగించాడు. తన రాజ్య ప్రజలకు బంగారం సమకూర్చమని కల్పవృక్షాన్ని కోరాడు, కల్పవృక్షము అందరికీ బంగారం ప్రసాదించింది. అందరూ క్షేమంగా గడుపుతున్నారు. విద్యాధరపు రాజ్యంలోనే కనకవర్షం కురిపించిన కల్పవృక్షం స్వర్గంనకు వెళ్ళిపోయింది. జీమూతవాహనుడు తనపరివారంను వెంటపెట్టుకొని మలయపర్వత ప్రాంతంనకు వెళ్ళిపోయాడు. అక్కడ శాంతిసౌఖ్యాలతో కాలం గుడుపుతున్నాడు.
ఆప్రాంతంనకు అధిపతి విశ్వావసు అనబడే సిద్ధుడు. విశ్వావసువునకు మిత్రావసువు అనే కుమారుడు, మలయవతి అనబడే కుమార్తె వున్నారు.
ఆ ప్రాంతమునందే చిన్న ఆశ్రమం యేర్పర్చుకొని వుంటున్న జీమూత వాహనునికి, మిత్రావసువునకూ స్నేహం ఏర్పడింది. ఈ యిద్దరిమధ్యనా యేర్పడిన స్నేహం కొన్ని రోజులకే బలంను పుంజుకున్నది. ఇద్దరు ప్రాణ స్నేహితులు అయినారు. ఈ కారణాన్ని అడ్డుపెట్టుకొని కొంతకాలానికి మిత్రావసువు తండ్రిని ఒప్పించి తన చెల్లెలు మలయవతిని, జీమూతవాహనునికిచ్చి వివాహం చేశాడు.
మలయవతి గౌరీదేవి భక్తురాలు. సదా అమెనే ప్రార్థించుచుండేది.” అంతేకాదు పూజించిన అనంతరం నిత్యనైవేద్యం పెట్టినగానీ తను భోజనం చేసెడిదికాదు. గౌరీదేవి కూడా మలయవతిని కాపాడుతూండేది.
ఈ విధంగా జరుగుతున్న సమయంలో మిత్రావశు, జీమూతవాహనుడు ఒకనాడు సాయం సమయంలో షికారునకు బయల్దేరి వెళ్ళారు. వారు క్రమంగా మలయగిరి సానువుల మీదకు వెళ్ళారు.
అక్కడ జీమూతవాహనునకు ఎముకల పోగు కనిపించింది. దానిని చూసి “బావా! ఆ ఎముకలరాసిఏమిటి ? అంతగా మెరుస్తున్నది ? అది మేమిటో యెందరు ఆ విధంగా అయినారో తెలియదు ? అని అడిగాడు. అంతేగాకుండా ఆ ఎముకలరాసి అంతా పాములదేనని కనిపిస్తున్నది అని అన్నాడు.
అంతట మిత్రావసువు “బావా! అది ఒక పెద్దకథ ! గరుత్మంతుని కోపాగ్ని జ్వాలలకు ఆహుతియైన పాముల యొక్క ఎముకలరాసియే అది” అని చెప్పాడు.
“అకథను గురించి నీకు తెలిస్తే తెల్సినంతవరకూ చెప్పు ! అని అన్నాడు జీమూతవాహనుడు” తప్పకుండా చెప్తాను ! విను” అన్నాడు మిత్రావసువు.
“చెప్పు”అని అక్కడే దిబ్బమీద కూర్చున్నాడు జీమూతవాహనుడు. మిత్రా వసువు అక్కడనే వేరొక బండమీద కూర్చుని ఆ కథను చెప్పమొదలు పెట్టాడు.
COMMENTS