విక్రమార్క భేతాళుడు చెప్పిన ఎనిమిదవ కథ : Read Vikram Betal Eighth Story in Telugu Language, బేతాళ కథలు, Vikramarka Bethala Kathalu Telugu for Kids.
విక్రమార్క భేతాళుడు చెప్పిన ఎనిమిదవ కథ : In this article, read Vikram Betal Eighth Story in Telugu Language, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids and Students.
విక్రమార్క భేతాళుడు చెప్పిన ఎనిమిదవ కథ Vikram Betal Eighth Story in Telugu Language
ఆ కాలంలో వీరేంద్ర సింహుడు అనే రాజు కాంభోజనగరంను పాలి స్తున్నాడు. అతని కుమారుడు ధీరేంద్రుడు. యీ ధీరేంద్రుడు బాల్యంనుండే ఎన్నోవిద్యలు అభ్యససించాడు. మంచి అందగాడు కూడాను. సద్గుణ సంపన్నుడు అయినప్పటికీ ఒక వేశ్యతో సంపర్కం కలిగించుకున్నాడు. ఆమె ఇంటనే వుంటూ ండేవాడు. ధీరేంద్రుడు డబ్బు పుష్కళంగా యిస్తుండటంచేత అతన్ని ఆవేశ్య బాగా చూసుకుంటూండేది.
క్రమేపీ ధీరేంద్రుడు వేశ్యాలోలుడు అయిన సంగతి తండ్రి వీరేంద్రునకు తెలిసింది. కుమారుడు వేశ్య ఇంటికి పోకుండా గట్టి బందోబస్తును చేయించాడు. కోటనుండి ధీరేంద్రుడుకి ఒక్క రూపాయి అయినా దక్కనీయకుండా కట్టుదిట్టం చేశాడు రాజు వీరేంద్ర సింహుడు.
యెప్పుడయితే అతను ధనం తెచ్చియివ్వలేదో ఆక్షణం నుండి అతన్ని చీదరించుకుంది. అంతేకాదు ఆ వేశ్య తన్నితరిమేసింది. మరోధనవంతుణ్ణి పట్టుకుంది.
ఈ సంగతి ధీరేంద్రునకు తెలిసింది. వెంటనే వెళ్ళి వేశ్యయింటవున్న ధనవంతునితో జగడము పెట్టుకొన్నాడు. అతన్ని అల్లరి చేస్తున్నందుకు ఆ ధనవంతుడు సహించలేకపోయాడు. కొందరు రౌడీలను ఏర్పాటు చేశాడు. ధీరేంద్రుని ఒంటరిగా వెడుతున్న సమయం కనిపెట్టి ఆ రౌడీలు అతన్ని చితకతన్నారు. ఆ ప్రాంతంలోనే వున్న అడవిలో పడేశారు. అతన్ని ఆవిధంగా అడవిలో పడేయడానికి కారణం అతనికి స్పృహవచ్చే సమయానికి యే కౄరమృగమో చంపివేస్తుందన్న నమ్మకం వలన.
చావు అందరికీ కోరినప్పుడు రాదు. చావాల్సివచ్చిన రోజున ఎవరైనా అడ్డుపడలేరు ? అడవిలో పారేసిన ధీరేంద్రుడు స్పృలేకుండా పడున్నాడు. ఒక సాధువు అటువెడుతూ ధీరేంద్రుని చూసి జాలిపడ్డాడు. అతని పరిస్థితిని 'అర్థం చేసుకున్నాడు. వెంటనే అతన్ని తన ఆశ్రమ కుటీరానికి తీసుకువెళ్ళి స్వయంగా చికిత్సచేశాడు. అతనుక్రమేపీకోలుకున్నాడు. కొద్దిదినాలకే ధీరేంద్రుడు ఆరోగ్యవంతుడు అయినాడు.
ధీరేంద్రుడు తన ఆత్మకథను వివరించాడు. సాధువు అతన్ని గురించి ఊహించాడు. అతనికి కామవాంఛ వెర్రితలలు వేస్తున్నదని తెలుసుకొన్నాడు. ఏ విధంగానైనా అతన్ని దారిన పెట్టాలని బాగా దృష్టిని తిలకించాడు. మాయా మంత్రమును ఉచ్చరించాడు.
అక్కడే పెద్ద సౌధం నిలిచింది. అందులో ఎన్నడూ చూడనివి, రుచిగొలిపే పదార్థాలు పళ్ళాలతోనిండి వున్నాయి, పట్టుపాన్పులూ, ఎన్నో వస్తువులూ యేర్పడి వున్నాయి! సుందరాంగినులను మించిన సుందరాంగులుకూడా సృష్టించబడింది.
కొంతకాలం దివ్యాభోగాలు అనుభవించాడు. ఒక నెలరోజులు అనంతరం సాధువు తనమాయాజాలంను విరమించుకున్నాడు. ఆయన సృష్టించి నవి మాయ మయినాయి. ఎప్పటి అడవి మాత్రం కనబడుతోంది. అనుభవించిన సుఖాలు, ఒక్కసారిగా అదృశ్యమవడంతో ధీరేంద్రుడు ఒక్కసారిగా అథోలోకంలో పడిపోయినట్లయింది. సాధువును కాళ్ళావేళ్ళాపడి బ్రతిమిలాడి తనకు భోగాలను కలగచేయమన్నాడు. సాధువు కరుణించలేదు. తన ఆశ్రమంలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు.
తర్వాత ధీరేంద్రుడు కూరేంద్రుడు అయినాడు. సాధువు మళ్ళీ అన్ని సృష్టించాడు. ఈ సాధువుమరల అవన్నీ నెలరోజుల వరకే యిచ్చారు. ధీరేంద్రుడు ఆలోచించి అసలు ఆసాధువే లేకుండా చేస్తే అతను సృష్టించినవి అలాగునే వుండిపోతాయికదా అని ఆలోచించి తను ఎల్లప్పుడు సుఖపడవచ్చును అని తలచాడు. అదే ఆలోచనతో సాధువును వధించాలని ఖడ్గం తీసుకుని బయల్దేరి వెళ్ళాడు. అది ముందే గ్రహించిన సాధువు “యేమిది ? నా శరీరం అదురు తున్నట్లున్నది? నాకేమైనా కీడుసంభవించున్నదా? అనిసాధువు అనుకుంటుండ గానే దూరం నుండి చేత ఖడ్గంబట్టి దొంగలాగ నక్కుతూ వస్తున్న ధీరేంద్రుడు కనిపించాడు. అతను ఖడ్గం ధరించి వస్తుండడంతో తనను ఖండించుటకా లేక విశేషభోగాలకు తృప్తి చెంది మాయను ఉపసంహరించమని కోరుటకా ? అందుకే అయితే చేతిలో ఖడ్గం దేనికి, అని పరిపరివిధాల అనుకున్నాడు. ఎందుకైనా మంచిది అని ఆత్మ రక్షణకు అవసరమైనట్లు కట్టుదిట్టం చేసుకున్నాడు. యేమిటో తెల్సుకొనదలచాడు. తనకు యేమియు తెలియనట్లు కళ్ళుమూసుకొని కూర్చుని దైవధ్యానాన్ని చేసుకుంటున్నాడు.
ధీరేంద్రుడు ఆశ్రమంలో అడుగుపెట్టాడు. సాధు, తపస్సు చేసు కుంటున్నాడు అతను తప్ప ఆశ్రమంలో వేరెవ్వరూ లేరు. అదే మంచి సమయం తనే సాధువుని సంహరించినట్లు యెవ్వరికీ తెలియదు. అదే మంచి సమయం అనుకున్నాడు ధీరేంద్రుడు. ఆ వెంటనే ఒకసారి చుట్టూ చూశాడు చేతపట్టిన ఖడ్గం పైకి ఎత్తాడు. అంతే ఎత్తిన కత్తి ఎత్తినట్లే వుండిపోయింది. శిలావిగ్రహం మాదిరి ధీరేంద్రుడు నిలబడిపోయాడు. అతను నిల్చున్నచోటు నుండి కదలలేని స్థితిలో వున్నాడు. ప్రయత్నం చేస్తూనే వున్నాడు.
సాధువు కళ్ళు తెరిచిచూశాడు. “మూర్ఖుడా! నిన్ను పుత్రవాత్సల్యంతో చూశాను. నీకోరికను తీర్చడం కోసం కష్టపడి సంపాదించిన విద్యలను కూడా ధారపోశాను. అయినా నీ నీచబుద్దిని చూపించావు నువ్వు ? నన్ను చంపినంత మాత్రాన యీ భోగాలన్నీ సుస్థిరంగా వుంటాయనా ! మూర్బుడా ! నీవంటి నీచుడు ఎన్నటికీ బాగుపడడు. నువ్వు బుద్ధివంతుడవి అవుతావని నీకోసం శ్రమించాను. నాది భ్రమ అయింది. నీది పాషాణ హృదయం పోరా పో!నువ్వు ఎన్నటికీ మారవు ఇకమీద! నువ్వు నిలబడిన చోటనే పాషాణమై పడివుందువు గాక” అని శపించాడు సాధువు. అప్పటి కప్పుడు ధీరేంద్రుడు పెద్ద రాయిగా మారిపోయాడు.
“కథను విన్నావుకదా ! వాత్సల్యంచేత సాధువు రాకుమారుని శపించక వదలివేయవచ్చును కదా” అడిగాడు భేతాళుడు! “సాధువు చెప్పినది సత్యము అంతటి కూరస్వభావుడుని క్షమించివేస్తే ఎన్నో ఘోరాలు జరుగుతాయి. రాయిగా పడివుంటేనే లోకం బాగుపడుతుంది. అందుకే సాధువు అంతటి శిక్షను విధించాడు.” అన్నాడు విక్రమార్కుడు.
ఆ మరుక్షణంలో మౌనభంగం జరిగింది కనుక భేతాళుడు అతని నుండి తప్పించుకుని మరలా మర్రివృక్ష కొమ్మను చేరాడు. విక్రమార్కుడు విడవకుండా తనూ మర్రివృక్షంచేరి భేతాళుని స్వాధీనపర్చుకొని భుజాన వేసుకొని సన్యాసి వద్దకు వెడుతున్నాడు.
COMMENTS