Kali Mata Darshanam Story in Telugu : కాళీమాత దర్శనం భేతాళ విక్రమార్క కథ, బేతాళ కథలు, Kali Mata Darshanam Vikramarka Bethala Kathalu Telugu for Kids.
Kali Mata Darshanam Story in Telugu Language : In this article, read కాళీమాత దర్శనం భేతాళ విక్రమార్క కథ, "బేతాళ కథలు", "Kali Mata Darshanam Vikramarka Bethala Kathalu Telugu" for Kids and Students.
కాళీమాత దర్శనం భేతాళ విక్రమార్క కథ Kali Mata Darshanam Story in Telugu
తన పరిపాలన గురించిన వివరాలు తెల్సుకొనుటకు ప్రత్యేకమైన మనుషుల్ని గూఢచారులుగా నియమించడం జరిగింది. ఆయన ఉజ్జయినీలో మాత్రమే వుండక దేశాలుఅన్నీ పర్యటించాడు. అందుకే యీ యేర్పాటు జరిగింది. వారు దేశ దేశాలు తిరిగివచ్చి అక్కడ వింతలను విశేషాలుగా చెప్పదలచి విక్ర మార్కుని సందర్శించారు. వారు వచ్చేసరికి విక్రమార్కుడు వేటకు వెళ్ళివున్నట్లు తెలిసి ఆయనరాక కోసం నిరీక్షించే నిర్ణయానికి వచ్చారు. వారు వచ్చిన రోజునే విక్రమార్కుడు వేటను ముగించుకుని తిరిగి నగరం చేరాడు.
అప్పుడు గూఢచారులు ఆయనకు నమస్కరించారు. విక్రమార్కుడు సింహాసనం అలంకరించగానే గూఢచారులు తమ అభిప్రాయాలను తెలిపారు. యెక్కడికి వెళ్ళినా విక్రమార్కుని, ఆయన పాలననీ మెచ్చుకునే వారేకానీ, పరిపాలన గురించి. నొచ్చుకునేవారు లేరని విన్నవించారు. అనంతరం ఒక గూఢచారి ఇలాగున అన్నారు -
మేము చూసివచ్చిన ప్రదేశాల్లో ఒకచోట మహాద్భుతమైనటువంటి విశేషం కంటపడింది ! అన్నాడు. 'ఏమిటది!' అనే ఆతృతతో అడిగాడు విక్రమార్కుడు.
“వింద్యపర్వత సమీపంలో అంధకారమయమైన ప్రదేశం వుంది. అక్కడ మహాకాళీ ఆలయం వుంది. అందులో ప్రతిష్టించబడిన మహాకాళీ విగ్రహం అమితమైన భయంకరంగా కనిపిస్తున్నది. ఆ విగ్రహం ముందు విశాలమైన నుయ్యిమాదిరిగా పెద్దగోయ్యివుంది. ఆ లోపల నుండి ఎన్నో త్రిశూలాలు పై వరకూ వున్నట్లు కనిపించాయి వాటికి పైన పెద్ద తొట్టివుంది. ఆ అగాధం అవతలగా గట్టువుంది ! ఆ గట్టు మీద నిలబడి ఎగిరి తొట్టెను పట్టుకోవాలి. దాన్ని వెంటనే ఖండించేయాలి ! ఆవిధంగా ఎవరయితే చేస్తారో వారికి మహాకాళి ప్రత్యక్షమై అతని కోరికలు తీర్చి, కోరినవరాలు యిస్తుందంట. ఇది అంతా లికించడిన ఫలకము అక్కడనే వుంది. ఈ పని ప్రయత్నించీ చేయలేనివారు అక్కడున్న త్రిశూలాలమీదపడతారు. ఆ త్రిశూలాలు తక్షణం వారి శరీరంలో దిగబడతాయి. వారు మరణించి తీరుతారు” అని అన్నాడు ఆ గూఢచారి.
“అందుకు ఎవ్వరూ ప్రయత్నించలేదా” అడిగాడు విక్రమార్కుడు.
“అందరికీ ప్రాణభయం వుంటుందికదా ! వీరులు అయినా భయం ముసుగులో వుండేవారికి ప్రాణభయం తప్పదుకదా ! అందుకని ఎవ్వరూ అందునిమిత్తం ప్రయత్నించినట్లు లేదు." అనిచెప్తూ,” అది చాలా భయంకరంగా వుందని చెప్పక తప్పదు అన్నాగు గూఢచారి.
“తమరు ఆ ఆలయంను దర్శించే అభిప్రాయంవుందేమోనని దారిచూప టానికి ఒక భిల్లుని వెంటతీసుకొచ్చాము. అంటూ వాళ్లతో వున్న ఒక మనిషిని చూపించారు.
ఆ భిల్లుడు నమస్కరించాడు విక్రమార్కునకు.
ఆవెంటనే మహామంత్రి భట్టినిచూశాడు "సోదరా! నాకు ఆ ఆలయ మును సందర్శించే అభిప్రాయం కలిగింది. నేను వచ్చేవరకూ రాజ్యపాలనను చూస్తుండుఅని భట్టికి చెప్పాడు. భట్టి అంగీకరించాడు. విక్రమార్కుడు బిల్లునివెంట పెట్టుకుని వెళ్ళాడు -
ఆ నిర్ణీత ప్రదేశం అమితమైన భయంకరంగా కనిపించింది. కూర మృగాలు విజయవిహారం చేస్తున్నాయ్. ఎక్కడ చూసినా గుహలు, పొదలు, ముళ్ళ పొదలు, లోయలూవున్నాయి. వాటిని దాటి నడుస్తున్నారు ఇద్దరూ. క్రమేపీ కాళికాదేవి ఆలయంనకు చేరారుఇద్దరూ. ఆభిల్లుడుఆలయంలోని రాతిఫలకంను, కాళికాదేవినీ, త్రిశూలాలను, గట్టును చూపించి మరోసారి వివరంగా చెప్పాడు. విక్రమార్కుడు అవన్నీ చూశాడు. అంతా అమితమైన
భయంగా కనిపిస్తున్నాయి. త్రిశూలాలకు పైభాగానవున్న చెట్టుకొమ్మకు ఏడుఇనుపగొలుసులు వ్రేలాడు తున్నాయి. అది మర్రివృక్షం. దాని కొమ్మలే గొలుసులుగా వ్రేలాడుతున్నాయ్ కాగా ఎగిరి ఆ ఏడుగొలుసులునీపట్టుకోవాలి. ఒకేవకదెబ్బనఖండించాలి అన్నాడు అతను. విక్రమార్కుడు అవన్నీ మార్చిమార్చిచూశాడు. అతనికి చనిపోతా నన్న భయంలేదు. ఆపని సాధించడంలో విజయం సాధించాలి. వెంటనే ఆ పరికరాల్ని కాళికాదేవినీ మార్చిచూస్తూ కొద్దిఘడియలు ఆలోచించాడు. మహాకాళి ఈ పద్దతి యెందుకు పెట్టిందోనని కొద్దిసేపు ఆలోచించుకున్నా సమాధానం చిక్కలేదు.
ఆ వెంటనే తుంటి ప్రక్కనవున్న వరలోనుండి ఖడ్గంను బయటికిలాగాడు దాన్ని కళ్ళకు అద్దుకున్నాడు. ఆలయంలో వున్న కాళీ విగ్రహానికి తలవంచి నమస్కరించాడు. తక్షణం ఏడుగొలుసులనూ ఖడ్గంలో ఖండించివేశాడు. పైన అతనికి యే విధమైన ఆధారమూ లేనందున త్రిశూలాలమీద పడ్డాడు.
అతనికి త్రిశూలాలు గుచ్చుకోలేదు. అందుకు కాళీమాతే అదృశ్య రూపంలో తనను కాపాడిందని అనుకున్నాడు.మాత కనబడకుండా తన రెండు హస్తాలతో త్రిశూలాలమీద పడిన విక్రమార్కుని అందుకొని అవతలగావున్న ఒడ్డున పడుకోబెట్టి అదృశ్యమైనాయి ఆచేతులు.
విక్రమార్కుడు తృళ్ళిపడి లేచినిలబడి దిక్కులుచూశాడు ఆతృతగా -
మహాకాళి అతని ఎదుట ప్రత్యక్షమైంది. అతను చేతులు జోడించి నమస్కరించి ఆమె దర్శనంతో తనుధన్యుడు అయినట్లు చెప్పాడు. అప్పుడు కాళీమాత అతన్ని చేయెత్తి దీవించింది. “నాయనా ! విక్రమార్కా! నీ సాహసానికి నేను ఎంతో మెచ్చాను ! నీవంటి సాహసవంతుడు చిరకాలం ఈ భూమిమీద వుండి పాలించాలి. అది ధర్మము కాబట్టి నీవు వెయ్యేళ్ళు రాజ్యపాలన సాగించమని ఆశీర్వదించింది. నీ పరిపాలన పూర్తి అయ్యేవరకూ నీ సోదరుడు భట్టి కూడా వేయిసంవత్సరాలు నీతోనే వుంటాడు. పరిపాలన పూర్తి అయినాక మీ సోదరులు యిరువురు నాలోనే ఐక్యమవుతారు అని దీవించింది మహాకాళి.
ఆనందభరితుడు అయిన విక్రమార్కుడు చేతులు జోడించి నమస్క రించాడు. “అమ్మా! నాదొక కోరిక. నీవు యీ మహారణ్యంలో, అంధకార మయంలో వుండుటకన్న మారాజ్యంలోనే నివసించమనీ, మాకుటుంబమేగాక, మాప్రజలు కూడా మీకు నిత్యం పూజించుతారని నా కోరిక. అనుజ్ఞను దయచేయండి” అని వేడుకున్నాడు.
ఆ తదుపరి బహుకొద్ది కాలానికే కాళీమాత విగ్రహన్ని తమ రాజ్య మునకు తరలించాడు. అక్కడ కాళీమాత ఆలయమును ఎంతో ఖర్చు పెట్టి నిర్మిం చాడు. విగ్రహ ప్రతిష్ట అవగానే ఈ ఉదంతం తమ ప్రజలకు తెలియ పర్చాడు.
తదుపరి జరిగిన దంతా భట్టికి అక్షరం విడవకుండా తెలియపర్చాడు. తన ఆయుషును వెయ్యిసంవత్సరాలు పెంచాడని, నాతోబాటు వేయి సంవత్సరాలు నీవు వుంటావని తెలిపింది” అని చెప్పి కాళికాదేవి అనుగ్రహం వలన మనం ఇరువురం వేయి సంవత్సరాలు విడిపోకుండా జీవించగలమన్న మాట” అని అన్నాడు విక్రమాదిత్యుడు. భట్టి బాగా ఆలోచించాడు. అతనికో ఆలోచనకలిగింది. మహారాజా! “దేవి మనకు వేయి సంవత్సరాలు ఆయువు ప్రసాదించింది కదా ! ఆవరంనుబట్టి నేను ఆవేయిని రెండువేల సంవత్సరాలుగా ఆయుషుని పెంచుతున్నాను” అన్నారు భట్టి.
" అదేమిటి” అన్నాడు విక్రమార్కుడు.
“అంటేమాత వెయ్యేళ్ళు రాజ్యపాలన సాగించమంది కదా! మీరు ఆరు మాసాలు రాజ్యపాలన, ఆరుమాసాలు దేశపర్యటన సాగించుచుందురు కదా! మీరులేని సమయంలో రాజ్యపాలన సంబంధమైన పనులు నేను చూస్తుంటాను కదా! ఈ విధంగా సాగించినట్లయితే రాజ్యపాలన చేయుటకు మీరు రెండు వేలసంవత్సరాలు జీవించాలి. మీతోబాటు నేనూ వుండాలికదా” అన్నాడు భట్టి.
భట్టి యుక్తితో చెప్పిన దానికి మిక్కిలి ఆనందించాడు విక్రమార్కుడు. అంతేగాక ఆనాటి నుండి ఆరుమాసాలు రాజ్యపాలననూ ఆరుమాసాలు దేశపర్యటననీ సాగించాడు.
నాటినుండి నేటివరకూ ఉజ్జయినీ నగరంలో కాళీమాత, ప్రజలచేత ఘనంగా కొలవబడుతోంది.
COMMENTS