విక్రమార్క భేతాళుడు చెప్పిన మూడవ కథ : Read Vikram Betal Third Story in Telugu, "బేతాళ కథలు", "Bhetaludu Cheppina Moodava Katha Telugu" for Kids.
విక్రమార్క భేతాళుడు చెప్పిన మూడవ కథ : In this article, read Vikram Betal Third Story in Telugu Language, "బేతాళ కథలు", "Bhetaludu Cheppina Moodava Katha Telugu" for Kids and Students.
విక్రమార్క భేతాళుడు చెప్పిన మూడవ కథ Bhetaludu Cheppina Moodava Katha Telugu
పూర్వ కాలంలో కాశీనగరమును వేదవర్మఅనబడే రాజు పాలించు తున్నాడు. అతని ఏకైకపుత్రికతిలోత్తమ. ఆమె సద్గుణ సంపన్నురాలైన అందగత్తెగా ప్రకాశించబడుతోంది.
రాకుమారి తిలోత్తమను, మంత్రి కుమారుడు పుండరీకుడు, సేనాధిపతి కుమారుడు వీరవర్మ, కోశాధికారి కుమారుడు ధనపాలుడు, ముగ్గురూ ఆమెను ప్రేమించారు. ఆ ముగ్గురూ ప్రేమించే అర్హతకలవారే! అయితే ఆ ముగ్గురిలో ఎవరికి తన కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేయాలన్న సందేహం కలిగింది రాజుకి! ఆలోచించి ఇక నిర్ణయానికి వచ్చాడు.
ఆ మర్నాడు ఉదయం ఆ ముగ్గురినీ రాజ్య సభకు పిలిపించాడు. ఆ ముగ్గురికీ తిలోత్తమను పెండ్లాడాలన్న కోరిక వుంది.
“మీ ముగ్గురులో ఎవరికిచ్చి పెళ్ళి చేయాలన్న సందేహం వుంది నాకు. ముగ్గురు సమర్దులే! అందువలన మీకొక పరీక్ష పెడుతున్నాను. అదేమిటంటే మీలో ఎవరు మహాశక్తికలిగిన వస్తువును తెచ్చి నాకు ఇస్తారో వారికి నా కుమార్తెను ఇచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు.
ఆ ముగ్గురూ ఆవెంటనే విడివిడిగా ప్రయాణమై వెళ్ళారు. దేశం అంతా తిరిగారు. ఆరుమాసాల అనంతరం ఆ ముగ్గురూ ఒకనగరంలో అనుకోకుండా కలిసారు. పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. వారిలో వీరవర్మ ఆలోచిస్తూ రాకుమారి తిలోత్తమ ఎక్కడవుందో ఏం చేస్తున్నదో, చూడాలని వుంది అన్నాడు.
ఆసమయంలో ధనపాలుడు “ఆశక్తి నాకు వుంది. కళ్ళకు కట్టినట్లు చూపించుతాను చూడండి!” అని తన వద్దనున్న అద్దంను తీశాడు. వెంటనే మంత్రోచ్చారణతో అద్దంలో చూశాడు. మిగతా ఇద్దర్నీ చూడమన్నారు.
అంతఃపురంలో విశాలమైన స్థలం! అది రాజభవనం ముందున్న పెద్ద చావిడి! అక్కడ రాజు రాణి అందరూ ఏడుస్తున్నారు. అవతలగా తిలోత్తమ శవం ఉంది. అది ముగ్గురూ చూసారు. తిలోత్తమ చనిపోయిందనుకున్నారు. వెంటనే ఆమె వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కానీ చాలా దూరం వుంది ఆ నగరం. “ఎలా వెళ్ళడం ?” అని అన్నాడు పుండరీకుడు.
“ నేను తీసుకువెడతాను అంటూ లేచాడు వీరవర్మ తను సంపాదించి తెచ్చిన తివాచీని పరిచాడు. దాని మీద ముగ్గురూ కూర్చున్నారు. ఆ తివాచీ వేగంగా బయల్దేరి ఆకాశమార్గాన పయనించింది. వారు అంతఃపురం భవనం వద్ద తివాచి మీదనుండి దిగారు. ఆ దృశ్యం చూసి విలపించసాగారు.
పుండరీకుడు వెంటనే తిలోత్తమ శవం వద్దకు వెళ్ళాడు. తనకు తెలిసిన మహత్తరమైనమంత్రపఠనంతో ఆమెనుతక్షణం బ్రతికించాడు. అంతా ఆనందించారు.
అనంతరం మహారాజు అమితానంద భరితుడయ్యాడు. తిలోత్తమను ఆమెకు ప్రాణ దానం చేసిన పుండరీకునకు ఇచ్చి వివాహం చేశాడు.
“విక్రమార్క భూపాలా! కథ అయిపోయింది! ఇప్పుడు చెప్పు ముగ్గురూ మహిమగల వస్తువులను సంపాదించినవారే? మహారాజు తన కుమార్తెను ఎవ్వరికిచ్చి వివాహం చేయాలి ?” అని ప్రశ్నించాడు భేతాళుడు.
విక్రమార్కుడు తక్షణం ఆలోచించాడు. “మహారాజు మంచి పని చేశారు! ఎందుకంటే ఆ ముగ్గురూ మహత్తరమైన వస్తువులు తెచ్చినవారే ! అయినా పుండరీకుడు చనిపోయిన తిలోత్తమకు ప్రాణదానం చేశాడు. అందువలన అతినికే రాకుమార్తెను ఇచ్చి వివాహం చేయడం సమంజసం” అని చెప్పాడు.
ఆవెంటనే యెప్పటిమాదిరి భేతాళుడు ఎగిరి వెళ్ళి చెట్టుకొమ్మను వ్రేలాడుతోంది. క్రితంమదిరే విక్రమార్కుడు తిరిగి వెళ్ళి భేతాళశవాన్ని స్వాధీన పర్చుకొని భుజానవేసుకొని నడుస్తున్నాడు. ఆ సమయంలో భేతాళుడు మరో కథను చెప్పసాగెను.
COMMENTS