Alibaba and Forty Thieves Thirteenth Story in Telugu : Read here పగపట్టిన దొంగలు ఆలీబాబా 40 దొంగలు కథ, Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
Alibaba and Forty Thieves Thirteenth Story in Telugu Language : In this article we are providing "పగపట్టిన దొంగలు ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
పగపట్టిన దొంగలు ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Thirteenth Story in Telugu
1 పగపట్టిన దొంగలు
నాయకుడు అంతమాత్రానఊరుకోలేదు. ఆగ్రహంతో చిందులు తొక్కుతూ లేచాడు. “మీరు ఎన్ని చెప్పినా నాకు నమ్మకం కుదరడం లేదు. నేను నమ్మను.”
"ఇదంతా పధకం ప్రకారమే జరుగుతోంది. మన గుహలో ప్రవేశించి దోచుకున్నవాడిని రెండుముక్కలగా నరికేసాము. వాడి మొడెంను తలను వేరుగా వ్రేలాడతీసాము. ఇప్పుడు ఆ రెండూ లేవు. మాయమయ్యాయి! అంటే ఎవరో పట్టుకుపోయారు. అంటేవాళ్ళకి మన సంకేతిక పదం తెలుసును కాబట్టి అలా చేయగలిగాడు. ఎంత సొమ్ము పోయిందో అంచనా చేయడం కష్టం. మన సాంకేతిక పదాలు తెలిసినవాడెవడో అసాధ్యుడై వుండాలి. మనం మనప్రాణాల్ని పణంగా పెట్టి దోచుకున్నాం. అదంతా కాజేయాలని ఎవ్వరో ఎత్తు వేశారు. రహస్యంగా మన గుహను కాళీ చేస్తున్నారు. అంటే మన స్థావరం మార్చాలి. పదాలు మార్చాలి. ఈ విధంగా ఎంతకాలం మార్చుకుంటూ వెళతాం ? మనం నలభై మందిమి మన గుహలోకి వెళుతున్నప్పుడు తిరిగి వస్తున్నప్పుడు ఎవరైనా, ఏచోటనైన మన పనిని కనిపెట్టుతున్నది లేనిదీ ఎవ్వరికీ తెలియదు. తెలుసుకోలేక పోయాం . మీ అందరిని నమ్ముకునే కదా! చేతకాని వాడిగా అసమర్ధుడనై ఉన్నాను. ఈ తప్పు ఎవరిది ?నాది. అప్రమత్తంగా ఉండడమే అవివేకం” అంటూ అరిచాడు నాయకుడు. .
దొంగలంతా సిగ్గుపడ్డారు. “దొరా నీవు ఆవిధంగా అనుకోవద్దు. ఇంత కాలం నుండి ఏమి జరగదన్న దీమాతో ఉన్నాము మేము. అందుకు చాలా విచారపడుతున్నాము. మా అశ్రద్ధవల్ల మనగుట్టురట్టయింది అదే మనం కొంప ముంచినది.” అని అన్నాడు ఒకడు.
“అదే నేనూ చెప్పేది.” అన్నాడు నాయకుడు.
ఆ వెంటనే దొంగలందరూ ఆగ్రహించారు. కత్తులు దూసారు. “మనకు ఏర్పడిన శత్రువులను బట్టి అంతం చేసేవరకు నిద్రపోకూడదు వాళ్ళ అంతు చూస్తాం.” అని అన్నాడు ఒకడు. అంతేకాకుండా నాయకుడు పాదాల యందు తలలు ఒంచి శపథం చేసారు.
“మమ్మల్ని నమ్మండి. మన శత్రువులు ఎక్కడ ఉన్నా బంధించి ఇక్కడికి వచ్చి మీ కాళ్ళమీద పడేస్తాం.” అన్నాడు మరొకడు.
నాయకుడు ఆలోచించాడు. అతనికి ఏదో ఆలోచన వచ్చింది. మనం ఇలా దోపిడీలకు వెళ్ళి దొంగతనం చేసి గుహలో పోస్తుంటే మన శత్రువులు దాన్ని జాగ్రత్త పరుచుకుంటారు. అందువలన ఆ దొంగలు దొరికే వరకు మనం దోపిడీలకు వెళ్ళద్దు. ముందు ఆ మోసగాళ్ళ కోసం గాలించండి. వాళ్ళను చిక్కించుకుని హతమార్చాకనే మళ్ళీ మనం దోపిడీలకు పోవడం” అన్నాడు నాయకుడు.
దొంగలంతా నాయకుడు మాటలకు తల వంచి అంగీకరించారు.
అంతలో దొంగల్లో ఒకడు ముందుకు వచ్చాడు. “దొరా! మీరు సమ్మతించినచో నేను వెళ్ళి ఆ వెధవ ఆచూకీ కనిపెట్టి వాడిని బంధించి, తీసుకువచ్చి మీ కాళ్ళమీద పడేస్తాను. ఈ మాట మీ పాదల ఆనగా వేసి చెప్తున్నాను. అని అన్నాడు.
వాడి మాటలు నాయకునికి ఎంతగానో నచ్చాయి. నీవంటి గుండెకల వాడు పట్టినపట్టు వీడనివాడు కావాలిరా నాకు. “అంతని భుజం మీద చేయివేసి ఆనందంతో అన్నాడు.” నీవు జాగ్రత్తగా ఉండు. పట్టుపడ్డావా మన కొంపలు అంటుకుంటాయి. “దొంగకు ధైర్యం చెప్తున్నట్టుగా చూస్తు తిరిగి అన్నాడు నాయకుడు.
'సరే దొరా!” అంటూ ఆదొంగ తన రూపు మార్చుకున్నాడు. మామూలు బాటసారిగా వేషం మార్చుకుని బయలు దేరి వెళ్ళాడు.
COMMENTS