Alibaba and Forty Thieves Seventh Story in Telugu : In this article కాశింను చంపేశారు ఆలీబాబా 40 దొంగలు కథ, Ali Baba 40 Dongalu Telugu Story for Kids.
Alibaba and Forty Thieves Seventh Story in Telugu Language : In this article we are providing "కాశింను చంపేశారు ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
కాశింను చంపేశారు ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Seventh Story in Telugu
ఆలీబాబా చెప్పిన రెండు మాటలూ మళ్ళీ మళ్ళీ తల్చుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళి ఆలీబాబాకు తనకూ జరిగిన కధను బార్యకు చెప్పాడు.
చివరగా ఆలీబాబాతో 'ఆ దొంగలు అసాధ్యులు కటికి వారికంటే అధికం యెందుకైనా మంచిది. నువ్వు మాత్రం జాగ్రత్తగా వుండు.' అని హెచ్చరిం చాడు తను అక్కడినుండి వెళ్ళేముందు.
కాశిం చెప్పిన జాగ్రత తనమీద అభిమానంతో చెప్పాడని అనుకున్నాడు ఆలీబాబా. కాశిం ఇంటికి వెళ్ళి భార్యకు చెప్పడంతో ఆమెకు ఆలీబాబా మీద అసూయ అధికమైంది. ఆ తదనంతరం జరగవలసిన పనిని గురించి ఆలుమగలు తీవ్రంగా ఆలోచించారు.
“ఇప్పుడు మనం యేం చేయాలి?” కాశిం భార్యను అడిగాడు.
“చేయాల్సింది చాలా వుంది. అలీబాబా మాదిరే మీరు యీ రాత్రికి బయల్దేరి వెళ్ళండి మన గాడిదలని తీసుకుపోండి. సంచులుని తీసుకుపొండి. సంచులు పట్టినంత, గాడిద మోయగలిగినంత, అక్కడున్న ధన కనక వస్తువులని పట్టుకురండి, అంది.
“ రాత్రి సమయం దొంగలు వస్తారు " అన్నాడు.
“వాళ్ళు రాత్రి అంతా దోపిడీలుచేసి ఆ ధనంతో తెల్లారి వస్తారు. దొంగలు చేసేపని అదేగదా! వాళ్ళు రాకుండానే ముందు మీరు నేను చెప్పినట్లు చేయండి! అన్నది కాశిం భార్య. “అనుకున్నది అనుకున్నట్లు అనుకున్నప్పుడే జరగాలి. సరే ! బయల్దేరు తాను యీ విషయం పొరపాటునైనా యెవరికీ తెలియనివ్వకు” అని అన్నాడు కాశిం.
“అదంతా ఆలోచించకండి ముందు మీరు బయల్దేరండి” అన్నది.
ఆ రాత్రి గాడిదలుని సిద్ధం చేసుకొని దొంగలు దోపిడీకి వెళ్ళేసమయంలో ఆలీబాబా చెప్పిన గుహకు చేరుకున్నాడు. ఆలీబాబా చెప్పిన మాటను ఉపయోగించాడు. దారికి అడ్డుగా వున్న బండ అవతలకు తప్పుకొంది. లోపలకు దారియేర్పడింది. కాశిం గాడిదలను కొండకుకొద్దిదూరాన వదలి గుహలో అడుగు పెట్టాడు. గుహను పరీక్షిస్తూ ముందుకు వెళ్ళాడు. అక్కడ గుట్టలుగా పోసివున్న బంగారు నాణేలు మొదలుగనవి చూశాడు. అతని ఆనందానికి అంతులేదు. గబగబా పట్టుకెళ్ళిన సంచుల్లోకి వాటిని ఎత్తాడు. ఆ మూటలుని తీసుకొని గుహద్వారం వద్దకు వచ్చాడు. ఆ ఆనందంలో తలుపు తెరుచుకునే మాట మర్చిపోయాడు. ఆలోచించాడు. ఎంతకీ గుర్తురావడంలేదు. కాశిం గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. తలుపు తెరవబడే మాటను గుర్తుచేసుకోవాలని మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు. విఫలుడైనాడు. భయంతో తనకున్న ఊహలు, ఆలోచనలూ పటాపంచలు అయినాయి. దొంగలు వస్తే తన ప్రాణానికే ముప్పు అన్న భయం బయల్దేరింది. తను నింపిన బస్తాలతో తనూ గుహలోపలనే వున్నాడు. తనను రక్షించమని అల్లాను అదే పనిగా వేడుకుంటున్నాడు.
లాభం లేకపోయింది. కొయ్యబారిపోయాడు. తను బంగారు నాణేలు మొదలగు వాటితో నింపిన సంచుల్ని చూస్తూ అక్కడే కూలబడ్డాడు.
బంగారు నాణేలు మొదలగునవి చూసిన మీద తలుపు తెర్చుకునే మాటను పూర్తిగా మరిచాడు. ఎంతగా ప్రయత్నించినా గుర్తుకి రావడంలేదు. సమయం గడుస్తున్న కొద్ది అతనికి గుండెల్లో దడ అధికమయింది. గుహ ద్వారాన్ని తెరవడానికి తనబలం అంతనీ ఉపయోగించాడు. లాభం లేకపోయింది. దొంగలు యే క్షణం అయినా రాగలరు. వచ్చే సమయం ఆసన్నమైంది. వాళ్ళు తననూ తనసంచుల్ని లోపలచూస్తే అక్కడే నరికి ముక్కలుచేస్తారు. 'అల్లా' అను కుంటూ నిరుత్సాహం ఆవరించి అక్కడే నిలబడి దిక్కులు చూస్తున్నాడు కాశిం.
తన తమ్ముడు ఆలీబాబా ధనవంతుడు అయితే తనూ తన భార్య అసూయపడ్డారు. అల్లా ఆలీబాబాను అనుగ్రహించాడు. ఆ అనుగ్రహం తన మీద చూపలేదు. అందుకే అంటారు 'ఒకరు బాగుపడ్డారంటే ఒక కన్ను పోయింది తను బాగుపడలేదంటే రెండు కళ్ళు పోయాయి' అని, తన పరిస్థితి అలానే వుందని నిరుత్సాహంతో నీళ్ళు కారిపోయాడు తన భార్య ప్రోత్సాహంతోనే తను బయల్దేరి వచ్చాడు. లేకరాలేదు కదా! తనకు ఎన్నో వ్యాపారులున్నాయి. వాటిల్లో బాగానే సంపాదిస్తున్నాడు. దురాశకు తలవంచి భార్య ప్రోత్సహించడం అదితను వినడం అవివేకమనిపించింది.
దొంగలు వచ్చేకాలం సమీపించింది. అడవి అంతా చీకటితో భయం కరంగా వుంది.
ఆ సమయంలో నలభైమంది దొంగలూ మూటలు గుర్రాలమీద వేసుకొని వచ్చే సమయం రానే వచ్చింది. వాళ్ళు వచ్చారు. దోచుకు వచ్చిన ధనం మూటలు భుజాల్న వేసుకొని అందరూ కాగడాలు వెలిగించారు. వాళ్ళు వాడిన పదంతో గుహ ద్వారం తెరుచుకుంది. .
దొగలు లోపల అడుగుపెట్టారు. దారికి అడ్డుగా కాశిం పెట్టిన సంచులు కనిపించాయి. నాయకునికి అనుమానంవచ్చి ఆగిపోయాడు. “మోసంఏమిటిది?” అని పెద్దగా అరిచాడు. దొంగలు అంతా వెనక్కి వచ్చారు. కాశిం అక్కడే ఒక బండమాటుననక్కాడు. కళ్ళుమాత్రం వాళ్ళని చూస్తున్నాయ్. దొంగలు అందరూ మొహాలు చూసుకున్నారు. ఈ
“మనం ఉపయోగించే సాంకేతపదాలు ఎవరో తెల్సుకున్నారు. వారికి ఎలా తెలిసింది ? యెవరో లోపలకు వచ్చారు వెతకండి. గుహలోనే వుండి వుంటారు బయటికి వెళ్ళే మార్గం లేదు. వెళ్ళే ప్రయత్నం మీద సంచులు నింపుకొని పెట్టుకున్నాడు. వెతకండి” అని గుహ ప్రతిధ్వనించేటట్లు అరిచాడు నాయకుడు.
దొంగలు “ఎక్కడరా బద్మాష్” అంటూ అంతా వెతికారు. అవతలగా బండచాటున వున్న కాశింను యివతలకు యీడ్చారు. కాగడా వెలుతురులో.
కాశింను దొంగలు అందరూ తన్నారు. కొట్టారు ఆవేశంతో నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టారు. అతన్ని క్రిందకు పడదోశారు. కాళ్ళతో తన్నుతూ దొర్లించారు.
"ఈ నీచుణ్ణి ముక్కలుగా నరికేయండి” అని ఆజ్ఞాపించాడు నాయకుడు.
కాశిం యేడుస్తున్నాడు. బ్రతిమిలాడుతున్నాడు. పిల్లలు కలవాడిని. నన్ను చంపద్దు. ఆ మూటలు తీసుకుని నన్ను క్షమించి విడిచి పెట్టండి.” అని నాయకుడు కాళ్ళా వేళ్ళాపడి బ్రతిమాలాడాడు.
అతని మాటలు వాళ్ళు వినిపించుకోలేదు. దొంగలు కత్తితో పొడిచి చంపేశారు కాశింను.
“శహభాష్ మనగుట్టు తెల్సుకున్న శత్రువుని ఖతం చేశాం. మన రహస్యం వీడితోనే పోయింది. ఇంక మనకు భయంలేదు. మనం అదృష్ట వంతులం అల్లా మన పక్షాన వున్నాడు కనుక మన సొమ్ముపోలేదు” అన్నాడు నాయకుడు.
తదుపరి నాయకుని ఉద్దేశం ప్రకారం దొంగలు కాశింతలను శరీరం నుండి వేరుచేశారు. ఆ తలను అతని మెండేన్ని ఒక మూలగా వ్రేలాడదీశారు.
అనంతరం దొంగలు మొత్తం గుంపుగా కూర్చున్నారు. వారికి మధ్యన అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్నాడు నాయకుడు.
అందరూ వాళ్ళ వెంట తెచ్చుకున్న మధ్యంను ఆరగించారు. ఆ సమయంలో పేరూ ఊరు చెప్పని ఆ కొత్తవాడు గుహలో యే విధంగా ప్రవేశిం చాడు అన్నది చర్చించుకున్నారు.
యేది యేమైనా సొమ్ము పోలేదు. అని తృప్తి చెందారు. ఇదంతా మనం దొంగతనం చేసి సంపాదించినదయినా ఎంత కష్టపడ్డాం. ఇది మన కష్టార్జితం. ప్రాణాలను లెక్కచేయకుండా దేశదేశాలూ కొల్లగొట్టి దోపిడి చేసి తీసుకు వస్తున్నాం. యెన్నెన్ని ప్రమాదాలనో ఎదుర్కొన్నాం. మన రహస్యం తెల్సుకున్న శత్రువును మట్టుపెట్టాము. ఇక మనకు పరవాలేదు. అయినా గుహమీద ఒక కన్నేసి వుంచండి. అప్రమత్తంగా వుండండి.” అని నాయకుడు అందరినీ ఉద్దేశించి అన్నాడు.
తదుపరి ఖాళీ సంచులతో బయటికి వచ్చారు. గుహద్వారం మూశారు. అందరూ గుర్రాల మీద ఎటో వెళ్ళిపోయారు.
తెల్లారింది
COMMENTS