Alibaba and Forty Thieves Fourth Story in Telugu : In this article "అసూయ ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
Alibaba and Forty Thieves Fourth Story in Telugu Language : In this article we are providing "అసూయ ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
అసూయ ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Fourth Story in Telugu
ఇంట్ల యేపని చేసుకుంటున్నా కుంచం గురించిన ఆలోచన పోలేదు. ఆమెలో అనుమానం అధికమైంది. అసూయ ప్రారంభమైంది. రాత్రి సమయంలో కుచంతో అంత అవసరం యేమొచ్చిందని ముసలిదాన్ని పంపారు. పూటగడ వటం కష్టంగా వున్న మరదికి కుంచంతో పనేమొచ్చింది? ధాన్యం కొలుస్తారా? నూకలు కొలుస్తారా అయినా కుంచంతో కొలిచేటంత ధాన్యంగానీ నూకలుగానీ వాళ్ళకు యెవరిచ్చారు? అందులో యెవరికీ తెలియకూడనిది యేమివుంది ? ఆ కధను ముందు నేను తెల్చుకోవాలి.
తల్లికుంచం పట్టుకొచ్చేలోపుగానే తమ పూరింట్లో పెద్దగొయ్యి తవ్వి వుంచుకొని ఆ సంగతి తల్లికి తెలియకూడదనుకున్నారు. కుంచంకోసం వెళ్ళిన తల్లి గొయ్యివేపుకి, రత్నలున్న గదికీ రాకుండా కుంచం అందుకొనేందుకు అలీబాబా భార్య గడపముందే నిలబడింది.
అత్తగారు వస్తున్నది చేతిలో కుంచం వుంది. ఆమె ఆనందించింది. అత్తగడపలో అడుగుపెట్టగానే చేతిలోని కుంచంను అందుకుంది. “అత్తమ్మ ఆవిడ మాతో మాట్లాడదు కాబట్టి నిన్ను పంపాను. పెద్దదానివి యేమను కొంటున్నావో యేమో” అంది. “ఇందులో అనుకునేందుకు యేముందమ్మా ఒకరికొకరు సాయపడాలి కదా యిందులో పెద్దలేదు. చిన్నలేదు” అన్నది.
“అక్క కుంచం అడగ్గానే యిచ్చిందా ? అడిగింది ఆలీబాబా భార్య.
“ఎందుకని అడిగింది ? నాకు తెలిస్తే కదా దానికి చెప్పడానికి, యే నూకలో కొల్చుకునేందుకు అనుకుంది. మనిషి కొంచెం కటువుగా కనిపించినా మనస్సు మంచిది “పాపం అడగ్గానే యిచ్చిపంపింది” అన్నది.
“సరే నువ్వు నీ గదిలోకి వెళ్ళిపడుకో పాపం నిద్ర పోకుండా చెప్పగానే వెళ్ళావ్” అన్నది అలీబాబా భార్య.
“ఇంతకీ యింత రాత్రి సమయంలో కుంచంతో పనేమొచ్చిందే” అడిగింది అత్తగారు. నాకూ తెలియదు. యెవరో నూకలు కొల్చుకు వెళ్ళమన్నా రుట. వాళ్ళు తెల్లవారుతే యేదో ఊరు వెళతారట. అందుకు గాను అవసరం వచ్చింది. అంది కోడలు.
“అవున్లే అదే అనుకున్నానేను. అందరూ చెడ్డవాళ్ళుంటారా ? మంచివాళ్ళూ వుంటారు. అంతా అల్లాదయ” అనుకుంటూ తన మంచం దగ్గరకు వెళ్ళి'అల్లా' అని గొణుక్కుంటూ పడుకుంది అత్త.
COMMENTS