Alibaba and Forty Thieves Fifth Story in Telugu Language : In this article "ధనపాతర ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
Alibaba and Forty Thieves Fifth Story in Telugu Language : In this article we are providing "ధనపాతర ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
ధనపాతర ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Fifth Story in Telugu
ఆలీబాబా భార్య కుంచం పట్టుకెళ్ళి భర్తకు యిచ్చింది.
" మా వదిన యెందుకని అడగలేదుటా ? ” కుంచం అందుకుంటూ అన్నాడు ఆలీబాబా.
“అందులో మీ వదిన అడక్కుండా వుంటుందా ? అడిగిందిట యెందుకో తనకు తెలియదని చెప్పిందట అత్తమ్మ పనికాగానే పట్టుకొచ్చి యివ్వమన్నదట అంది. “సరే తలుపుమూసిరా " అనగా ఆలీబాబా భార్య వెళ్ళి తలుపు మూసి వచ్చింది.
“నేను కొల్చియిస్తాను. నువ్వు లెక్కపెట్టుకుంటూ పాతరలోపోయి” తిరిగి అంటూ కుంచంను అందుకుంది. ఆ వెంటనే ఆలీబాబా భార్యకుంచంతో కాల్చి ఆలీబాబాకు యివ్వడం. ఆలీబాబా లెక్కపెట్టుకుంటూ పాతరలో పోయడం జరిగింది.
“మొత్తం యాబై కుంచాలు అయినాయి. యింకా అరకుంచెం సుమారు మిగిలినాయి” అన్నాడు భార్యనుద్దేశించి “వీటిని పాతరలో పోశెయ్యనా” అని అడిగాడు భార్యని మళ్ళీ.
“ఇదిగో నేను చెప్పేది విను మన పెళ్ళి అయిన దగ్గర్నుంచి మనం కడుపునిండా తిండి తినలేదు సరికదా యెన్నిపూటలు తిండిలేక మంచినీళ్ళు త్రాగి కాలం గడిపాము? సరైన బట్టలు కూడా కట్టుకోలేదు. చీకి చినుకు పట్టిన బట్టలతోనే కాలం గడిపాము. యింకా నా వంటి మీద చిన్న బంగారం కూడా లేదు. అప్పుడు మనకు స్తోమత లేదు. కాబట్టి లేనట్లు గడిపాము. ఇప్పుడు అల్లా మనకు కలుగచేశాడు. ఆలోచించకుండి ఆ మిగిలిన బంగారు నాణేలు అలాగే వుంచాదాం. వాటిని మన ఖర్చులకు వాడకుందాం. తెల్లారగానే పట్నం వెళ్ళండి. నాకు, మీరు, బిడ్డకూ మంచి బట్టలు తీసుకురండి. ఇంట్లోకి కావలసిన సామానులు అన్నీ తీసుకురండి” అంది ఆలీబాబా భార్య ఆశతో.
భార్య చెప్పిందంతా నిజమేకనుక ఆలీబాబాకు ఆమె చెప్పినట్లే చేయాలని పించింది.
“అవును బేగం ఇన్నాళ్ళు మనం కటిక దరిద్రులుగా బ్రతికాము. మనం గానీ, మన బిడ్డడుకానీ కుమిలిపోతున్నా అల్లామనకు యివ్వలేదని తృప్తిపడినాం. వున్ననాడు వున్నట్లు లేనినాడు లేనట్లు గడుపుకున్నాం. అప్పుడు ఎవరన్నా మనగురించి పట్టించుకున్నారా ? మనం యేనాడన్నా చెయ్యిజాచి యెవర్నయినా యాచించామా అదీ లేదు కదా! నాకవలన నువ్వు, మన వలన మన బిడ్డ సుఖపడియెరుగం. మా అమ్మకూడా మనపరిస్థితిని బట్టినడుచుకునేది. అందు వలన నువ్వు చెప్పిన విధంగానే యీ నాణాలు మన ఖర్చుకి వినియోగించు కుందాము” అని చెప్పాడు.
ఆలీబాబా భార్య ఆనందించింది.
ఆ వెంటనే ఆలుమగలు యిద్దరూ పాతరను పూడ్చివేశారు. అక్కడ పాతరలో దాచినట్లు ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఆలీబాబా. మిగిలిన నాణాలు భార్యకు యిచ్చాడు. ఆమె వాటిని తీసుకొని వెళ్ళింది భద్రపర చడానికి, కుంచంతో పని అయిపోయిందికదా తెల్లారగానే నువ్వు పట్టుకొని వెళ్ళి మా వదినకు యిచ్చిరా” అన్నాడు ఆలీబాబా. భర్త చెప్పినట్లు ఆ మర్నాటి ఉదయం కుంచం తనే స్వయంగా తీసుకువెళ్ళాలి. అంతక్రితం తోటికోడళ్లు ఒకరితో ఒకరు మాట్లాడకపోయినా ఆలీబాబా భార్య అక్క చేసిన సహాయానికి తనే కృతజ్ఞతను చెప్పుకుందామని కుంచం యిచ్చి రావాలనుకొని వెళ్ళింది.
అక్కా ఇదిగో మీకుంచం. “నువ్వు అడగ్గానే యిచ్చావ్ చాలా సంతోషం.” అంటూ కుంచంను కాశిం భార్యకు యిచ్చింది తీసుకుంది. యెందుకు తీసుకు వెళ్ళారని అడగలేదు. క్రితం ఆలీబాబా భార్యతో మాట్లాడనిది ఆమెకు మర్యాద చేసి పంపింది.
కుంచంలో కొల్చినా లోపల తోడికోడలు యేం పెట్టిందీ చూడలేదు. తను మైనం అతికించిన సంగతి గుర్తుకు వచ్చి కాశిం భార్య అడగలేదు.
ఆలీబాబా భార్య వెళ్ళిపోయింది. అనంతరం కుంచంతో తను పెట్టిన మైనం చూపింది. దానికి చిన్న బంగారునాణెం అతుక్కుంది. అలాగున అతుక్కు నేటందుకేగా మైనంఅంటించింది. దాన్ని బయటికి తీసి పరిశీలించింది. నాణెం మెరుస్తున్నది. ఆమె గుండెలు గుభేలుమన్నాయ్. “యేమిటబ్బా ఆశ్చర్యంగా వుందే” అని గొణుక్కుంది.
గంజికి కూడా గతిలేని ఆలీబాబా బంగారునాణాలా ? వింతగా వుందే ఆ నాణాలు కుంచంతో కొలిచేటంత దక్కినాయా ? ఒక్కసారిగా అంతధనం వచ్చిపడింది! అంటే వాళ్ళు తమకన్నా ఎక్కువగా భాగ్యవంతులు అయినారని ఆందోళన చెందింది. ఇంక వీళ్ళకి దరిద్రం లేదు. నల్లపూసల దండతో వున్న తోడి కోడలు మెడనిండా బంగారు ఆభరణాలు వస్తాయన్నమాట! అనుకుంది పదేపదే.
యేది యేమైనా వాళ్ళు ధనవంతులు అవడానికి వీలుపడదు; అయినా తమకున్నా ఎక్కువ స్థితిలో వుండేందుకు అసలే మనస్కరించలేదు. యేం చేయాలి దానికి విరుగుడు యేమిటి ? అని పరిపరి విధాలా ఆలోచిస్తున్నది.
COMMENTS