Alibaba and Forty Thieves Eighth Story in Telugu : In this article కాశింభార్య ఆందోళన ఆలీబాబా 40 దొంగలు కథ, Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
Alibaba and Forty Thieves Eighth Story in Telugu Language : In this article we are providing "కాశింభార్య ఆందోళన ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
కాశింభార్య ఆందోళన ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Eighth Story in Telugu
ఎంతో పొద్దెక్కింది. ఆ క్రితం రోజు వెళ్ళిన భర్త కాశిం తిరిగి రాలేదు. కాశిం భార్యలో ఆందోళన బయల్దేరింది. “ధనాశతో భర్తను పోగొట్టుకుంది గాడిదలను వెంటపెట్టుకుని అడవికి వెళ్ళిన మనిషి యెంతకీ రాలేదు. “అల్లా! ఆయనకు యే ప్రమాదం అన్నా సంభవించిందేమో ! నువ్వే దిక్కు కాపాడు అల్లా' అని పదేపదే అల్లాను వేడుకుంటున్నది.
తనలో తాను భర్తను తల్చుకొని కుమిలిపోతున్నది.
దీన్ని గురించి యితరులకు యెలా చెప్తుంది. చెప్పే విషయం కాదుకదా! యేం చేయడానికీ తోచడంలేదు. చివరగా గుహనుగురించి ఆలీబాబాకు చెప్పి అతని సహాయంను కోరాలని తలచింది. ఇందుకు కారణం అడవికి వెళ్ళి బంగారు నాణేలు తెచ్చింది అనేకదా. ఆ స్థలం, అరణ్యం అంతా ఆలీబాబాకు తెల్సును కాబట్టి ఆలీబాబాకు చెప్తే తనే అడవికి వెళ్ళి విషయం తెల్సుకుని రాగలడు అనిపించింది. అది అలావుండగా ఆలీబాబా నమ్మకస్తుడు సహృదయం కలవాడు. అన్నంటే యెంతో ప్రేమ. తనకు వాటిల్లిన నష్టానికి ఆలీబాబాయే దిక్కు అనిపించింది. అని ఆలోచించి, ఆపనే చేయాలన్న నిర్ధారణతో బయల్దేరి ఆలీబాబా యింటికి వెళ్ళింది కాశిం భార్య.
తోటికోడలు రావడం గమనించి ఆలీబాబా భార్య ఆశర్యచకితురాలైంది. తన వివాహం అయిన తదుపరి ఆమె రావడం అదే ప్రధమ పర్యాయం.
ఆమె వెళ్ళి ఆలీబాబాకు చెప్పింది. ఆలీబాబా ఆనందంతో వీధి గుమ్మం లోకి వెళ్ళి కాశిం భార్యను ఆప్యాయంగా చూశాడు.
“రండి వదినా రండి” అన్నాడు లోపలకు దారి చూపించుతూ.
కాశిం భార్యకమౌనంగా కంటతడిని తుడ్చుకుంటూ లోపల అడుగు పెట్టింది. అత్తగార్కి నమస్కరించింది. ఆలీబాబా చూపిన పీట మీద కూర్చుంది.
ఆలీబాబా భార్య లోపలకు వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి యిచ్చింది.
కాశిం భార్య నీళ్ళు త్రాగలేదు. ఆ తదుపరి 'టీ' యిచ్చింది.
టీ మాత్రం కొద్దిగా త్రాగింది.
“యేమిటి వదినా వచ్చావ్” అన్నాడు ఆలీబాబా.
కాశింభార్య బావురమని యేడ్చింది. ఆమె ఎందుకు ఆ విధంగా యేడు స్తుందో ఆలీబాబాకు, అతని భార్యకు బోధపడక ఒకరినొకరు చూసుకున్నారు. “వదినా ముందు యేడుపుమాని యేం జరిగిందో చెప్పు” అన్నాడు ఆలీబాబా.
“దొంగల గుహ గురించిన వివరం నువ్వు మీ అన్నకు చెప్పావు కదా. వెళ్ళి దొరికినంత ధనంను పట్టుకురమ్మని నేనే మీ అన్నను ప్రోత్సహించి వెళ్ళమన్నాను. నా మాట మీద ఆయన గాడిదల్ని తోలుకొని నిన్ననగా వెళ్ళారు. ఇంతవరకు తిరిగిరాలేదు. నాకు భయంగా వుంది. మనస్సు యేమో తెలియని కీడు శంకించుతోంది. అడుగడుగునా అపశకునాలే కనిపించుతున్నాయి. నాకు అంతా అయోమయంగా వుంది. నేను యిక్కడికి వచ్చింది నీ సలహా తీసుకోవ డానికి నిన్ను నీ అన్నకోసం పంపుదామని. ఆలీబాబా నువ్వు మీ అన్న ఒక తల్లి కడుపున బిడ్డలు. నేను బయటదాన్ని నేనంటే నీకు అయిష్టం అవవచ్చు తోడబుట్టిన నీ అన్నకోసం "అడవికి వెళ్ళి జరిగిందేమిటో తెలుసుకోనాయనా”అని మళ్ళీ వలవలా యేడ్చింది.
ఆలీబాబా భార్య ఓదార్చి ధైర్యం నూరిపోసింది.
“ఈ సంగతి మీ అమ్మకు చెప్పకు "కన్నతల్లి ఆమె బాధ వర్ణనాతీతమవు తుంది” అని అంది బొంగురు స్వరంతో కాశింభార్య. జాలిగుండె గల ఆలీబాబా వదినగారు యేడుస్తుంటే తనూ ఆందోళనతో బావురుమన్నాడు. ఆలీబాబా. భార్య భర్తను, తోటికోడల్ని ఓదార్చి ధైర్యం చెప్పింది. “అక్కా ! నీవు యింతగా యేడవాల్నా ? వెంటనే నీ మరిది బయల్దేరి అడవికి వెళ్ళి జరిగిందేమిటో తెల్సుకుని వస్తాడు. ఇంతెందుకు ? బావగార్ని వెంటపెట్టకుని క్షేమంగా తిరిగి వస్తాడు ధైర్యం చెప్పింది ఆలీబాబా భార్య, ఆలీబాబా కళ్ళు తుడుచుకుంటూ క్షణం ఆలోచించాడు. “వదినా! యేడవకు ! నీయేడువు వింటే ఇరుగుపొరుగు వాళ్ళంతా పోగవుతారు. అందరూ జరిగిందేమిటని అడుగుతారు. మన రహస్యం తెల్సుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైనది. రహస్యం బయటపడితే ప్రాణాల మీదకి వస్తుంది. దొంగలు కసాయి వాళ్ళు కూడా. నాకీ అనుమానం మొదట నుండీ వుంది. కొంప మునుగుతుందని. అంతపనీ అయింది. నువ్వు యేడవ కుండా ధైర్యంగా వుండు. నేను తక్షణం అడవికి వెడతాను. అన్నగారి ఆచూకి తెల్సుకొని వస్తాను. అని ఓదార్చాడు. ఈ రహస్యం నీ పెదవి దాటి రానీయకు. తిరిగి అని ఆమెను వాళ్ళ ఇంటికి పంపేశాడు ఆలీబాబా.
ఆలీబాబా గాడిద వెంట తీసుకొని కట్టెల కోసం వెళ్ళాడు ఎప్పటిమాదిరే. దొంగల్యగుహ వున్నచోటునకు చేరుకున్నాడు. గాడిదలు విడిగా గడ్డిమేస్తూ వుండడంతో ఆలీబాబా గుండెలు గుబేలుమన్నాయి. ఎంతగా వెతికినా అన్న జాడ కనపడలేదు. యేదో ప్రమాదంలో చిక్కుకుని ఉంటాడనిపించింది.
ధైర్యం వహించాడు. గుహ ద్వారం దగ్గరకు వెళ్ళి దొంగల సాంకేతిక పదంతో మూడుసార్లు అన్నాడు. తలుపు తట్టాడు. తలుపులు తెర్చుకున్నాయి. గుహలో అడుగు పెట్టి వెతుకుతున్నాడు. గుహంతా రక్తపు మరకలతో వుంది. ఆలీబాబా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. మరో నాలుగు అడుగులు వేసి చూశాడు. ఆలీబాబా కాళ్ళక్రింద భూమి కదలినట్లయింది. ఏడుపు ఆపుకోలేక పోయాడు. అయినా సంబాళించుకున్నాడు.
COMMENTS