Vikram and Betal Stories in Telugu Language : In this article, read భేతాళ కథలు, "విక్రమార్కుడు కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids.
Vikram and Betal Stories in Telugu Language : In this article, read భేతాళ కథలు, "విక్రమార్కుడు కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids and Students.
భేతాళ కథలు Vikram and Betal Stories in Telugu
బ్రాహ్మణ కుమారుడు ఒకడు ఎక్కడెక్కడో తిరిగొచ్చి ఉజ్జయినీ నగరంలో అడుగుపెట్టాడు. అతను నడిచి నడిచి బాగా అలిసిపోయాడు. ఇంకా నడిచే ఓపిక నశించింది. ఎక్కడన్నా విశ్రాంతి తీసుకోవాలని వీథులు పట్టి తిరిగాడు. అది రాత్రి సమయం ! యెక్కడన్నా పడుకొని విశ్రాంతి పొందిన గాని మనస్తిమితం ఉండదనిపించింది. అలా తిరుగుతున్న అతనికి ఒక భవంతి ముందు గేటుకి ఇరుప్రక్కలా వున్న అరుగులు కనిపించాయి. ఆ అరుగులు ఎవరివైనా కాని తాను విశ్రాంతి తీసుకొని మర్నాడు ఉదయం వెళ్లిపోవాలనుకున్నాడు. పై కండువాతో అరుగును దులుపుకొని దానిమీద నడుం వాల్చాడు. బాగా అలసివున్నమీద పడుకోగానే నిద్రపట్టింది.
ఆ మరుసటి రోజున కోడికూసిన వేళయందు దాసీలు వచ్చారు. వాళ్ళు ఆ ఇంటిముందు చిమ్మి, నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టే అభిప్రాయంతో వచ్చారు. అరుగుమీద నిద్రపోతున్న బ్రాహ్మణుడను లేపాలని ప్రయత్నించారు. అతనిలో యేమాత్రం కదలికలేదు. ఆ మరుక్షణం వాళ్ళు లోపలకు వెళ్ళి మదన రేఖకు యీ విషయం తెలియపర్చారు.
ఆ సందర్భంలో ఆమె కుమార్తె చిత్రరేఖ అక్కడనే వుండి దాసీలు చెప్పింది విన్నది ! ఆ క్షణమే ఆమె వీధి అరుగుల వద్దకు వెళ్ళింది ! చిత్రరేఖతో బాటు ఆమెతల్లి మదనరేఖకూడా వెళ్ళింది. -
వీరిద్దరూ వేశ్యజాతికి చెందినవారు. చిత్రరేఖ బహుచక్కనిది. అందగత్తెలను మించిన అందం కలది ! ఈమె మదన రేఖకు లేక లేక పుట్టన పడుచు ! యీమె తప్పవేరెవ్వరూ సంతతి లేరు.
చిత్రరేఖచేత వేశ్యావృత్తి చేయించి, కోట్లకు అధిపతురాలను చేయాలని తల్లి మదనరేఖ కోరిక ! అమెను ఆ వృత్తిలో దించాలని మదనరేఖ ఎంతగానో ప్రయత్నించి విఫలురాలయింది.
చిత్రరేఖ చక్కనిది మాత్రమేగాక భరతనాట్యశాస్త్రంలో ప్రవీణురాలు. ఆమెకు వేశ్యావృత్తిలో దిగడం ఇష్టం లేదు. అందుచేత ఎన్నిసార్లు వెంటపడి అడిగినా తల్లిమదన రేఖ బోధనని తిరస్కరించింది. తను శీలవతిగానే తనకు నచ్చిన వాని పెండ్లాడి బ్రతుకు సాగించదలచినట్లు తన నిర్ణయాన్ని వెలిబుచ్చినది.
కూతురు చిత్రరేఖకు ఏ మహారాజు చేతనో, ఏ చక్రవర్తిచేతనో కన్నెరికం పెట్టించి సంపాదించాలన్న తపన తప్ప తల్లి మదనరేఖకు వేరే ఆలోచన లేదు.
ఎందరో రాజులు, సుందరాంగులైన రాకుమారులు ఆమె పొందుకోసం నిరీక్షిస్తూ, ప్రయత్నాలు జరిపి విఫలులయినారు. తల్లి కోరిక తన మనస్సుకి విరుద్ధం కావడంతో ఆ విషయంలో తల్లిని ఎదిరించింది. తన నిర్ణయానికి తిరుగు లేదని . పదేపదే తనను నిర్బందించి విసికించవద్దని హెచ్చరించింది చిత్రరేఖ.
ఆ ఇద్దరి వాదనా ఈ విధంగా వుంది. అదే సమయంలో గత రాత్రి ఎవరో బ్రాహ్మణుడు వచ్చి తమ అరుగుమీద పడుకుని నిద్రపోయాడు. యెంతలేపినా అతను లేవడంలేదని దాసీలు చెప్పిన మాటలకు ఆశ్చర్యపడింది! వెంటనే బయటకు వెళ్ళింది. ఆమెతోబాటు తల్లి మదనరేఖా బయటకు వెళ్లింది.
COMMENTS