Vidyavantudu Nayyanu Vikram and Betal Story in Telugu : విద్యావంతుడు నయ్యాను తెలుగు కథ, బేతాళ కథలు, Vikramarka Bethala Kathalu Telugu for Kids.
Vidyavantudu Nayyanu Vikram and Betal Story in Telugu Language : In this article, read విద్యావంతుడు నయ్యాను తెలుగు కథ, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids and Students.
విద్యావంతుడు నయ్యాను తెలుగు కథ Vidyavantudu Nayyanu Vikram and Betal Telugu Story
నాలో విద్యనేర్చుకోవాలన్న కాంక్ష మొదలయింది. విద్య నేర్చుకోవాలన్న పట్టుదలతో ఇల్లు విడిచి ఎవరికీ చెప్పకుండా బయల్దేరి వచ్చాను. ఎంతమందినో నాకు విద్యనేర్పమని ఆశ్రయించాను. కానీ నా కోరిక కోరికగానే వుండిపోయింది! ఎవరూ సమ్మతించలేదు. అయినప్పటికీ నిరుత్సాహపడకముందుకు నడిచాను. యెన్నో ప్రదేశాలుతిరిగాను. ఆఖరున ఒక రాక్షసుని వలన సకల విద్యలావిద్యా పారంగతుడనైనాను.
“రాక్షసుడా” అతని మాటకు అడ్డుతగుల్తూ ఆశ్చర్యంగా చూసింది చిత్రరేఖ. “అతను గంధర్వుడు” శాపవశమున బ్రహ్మరాక్షసి అయినాడు. నాకు విద్యాబోధన చేయడంతో శాపవిముక్తుడు అయినాడు ! నన్ను దీవించి, తను గంధర్వలోకానికి వెళ్లిపోయాడు. ఆయన ఆశీర్వచనాలు అందుకుని నేను తిరిగి ఇంటికి బయల్దేరినాను. రోజులు తరబడి నిద్రలేకుండా నడిచినందున బాగా అలసిపోయాను. దానికితోడు తిండిలేదు. మీ ఇంటి దగ్గరకు వచ్చేసరికి మీ వీధి అరుగులు నన్ను ఆకర్షించినాయి. అప్పుడు మీ అనుమతిని పొందకుండా మీ అరుగుమీదపడుకుని నిద్రపోయాను ఇదీ నాకథ” అన్నాడు.
అతను చెప్పిన దానికి చిత్రరేఖ ఎంతో ఆనందించింది. వెంటనే తల్లి మదనరేఖను పిల్చి చెప్పింది. తప్పనిసరైనట్లు తల్లి మదనరేఖ ఆనందించింది.
విద్యాసాగరుడు ఆలోచిస్తున్నాడు.
“అన్యధా తల్చక మీరునన్ను స్వీకరించండి” అని వేడుకుంది. -
చిత్రరేఖా ! నిన్ను పెళ్ళాడేటందుకు నా మనస్సు అంగీకరించడంలేదు. కారణం యేమిటంటావా ! నేను బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడిని ! నువ్వు వేశ్యాకులంలో పుట్టినదానవు. మనిద్దరి వివాహానికి కులాలు అడ్డువస్తున్నాయి! నువ్వు నాకు ఎంతో సేవచేశావు ! నీ కోరికను తీర్చవలసిందే ! కానీ మనస్సుఒప్పు కోవడం లేదు. నువ్వు వేశ్యాజాతిలో పుట్టినప్పటికీ కన్యగానేవు న్నావు. ఇంతవరకు పరపురుష సంపర్కం తెలియనిదానివి. అయినా నా మనస్సు అంగీకరించడం లేదు. నువ్వు నాకు ఎంతో సేవచేశావు కదా ! నీకు జీవితాంతం ఋణపడివుండాలి ! కానీ నేను పెండ్లికి మాత్రం అంగీకరించను. నువ్వు చేసిన సేవకి ప్రత్యుపకారంగా నువ్వు మీదికోరినా ఇవ్వడానికి సిద్ధంగా వున్నాను. . అయితే పెళ్ళి మినహా యేదయినా కోరుకో ఇది నా అభిప్రాయం” అన్నాడు.
అమె మనస్సు అతని మీదనే లగ్నమైవుంది. యెన్నో విధాల నచ్చ చెప్పడం మొదలెట్టింది ! ఎంతకీ విద్యాసాగరుడు అంగీకరించడంలేదు.
“మాహాభాగా! నా మనస్సు పూర్తిగా మిమ్మల్నే కోరుకుంటోంది. కులాన్ని అడ్డు పెట్టుకొనినన్ను పెళ్ళాడబోతే నాకు మరణమే శరణ్యం ! నీవు నాకు దక్క కుండా వుంటే నేను మరణించుతాను.” ఇది నా నిర్ణయం ! అన్నది చిత్రరేఖ.
కూతురు చివరిమాటలనువిన్న మదనరేఖహడలిపోయింది. కూతురుతో “అతనికి సేవచేస్తూండు! నేను వెళ్ళి మహారాజునికల్సుకొని విషయం వివరించి వస్తాను” అంది.
మదనరేఖకు “కూతురుకి కన్నెరికం పెట్టించే ఆలోచనవున్నా కూతురు మనస్సును బట్టి ఆమె పద్దతినే అంగీకరించింది. విద్యాసాగరుడు తన కూతుర్ని పెళ్ళాడకపోతే. కూతురు తనకు దక్కదు అని అనుకుంది. వెంటనే వెళ్ళి మహారాజుని కల్సుకుంది. జరిగిన కథను అంతా వివరించి తన బిడ్డ మరణించ కుండా చేయమని వేడుకుంది. తన కూతురుకి ప్రాణదానం చేయడం ఆయన చేతిలోనే వున్నట్లు” మొర పెట్టుకుంది.
రాజు అంతావిన్నాడు. క్షణం ఆలోచించాడు. ఆ తక్షణం రాజభటులను పిలిచి, విద్యాసాగరుని వెంటపెట్టుకురమ్మనిపంపాడు. రాజభటులు ఆ పనిని వెంటనే ఆచరణలో పెట్టారు.
విద్యాసాగరుడు వస్తూనే రాజునకు చేతులు జోడించి నమస్కరించాడు. “విద్యాసాగరా ! నీవు పండితుడవు ! నీకు తెలియని ధర్మములు అంటూ వుండవు! చిత్రరేఖ నీకు యెన్నో సేవలు చేసి నిన్ను పునర్జీవుడను చేసింది. ఆ సమయంలో ఆమె నిన్ను మనసారా ప్రేమించింది. నీవు అన్నీ తెలిసిన వాడవు నీవు ఆమెను భార్యగా స్వీకరించకపోతే ఆమె మరణించుతుంది. కనుక నీవు ఆమెను భార్యగా స్వీకరించు” అని చెప్పాడు రాజు. .
“మహారాజా ! దయతో నా విన్నపమును ఆలకించండి ! నేను బ్రాహ్మ ణుడను “ఆమెను స్వీకరించేటందుకు ఆమె బ్రాహ్మణ కన్యకాదుకదా!”
“అట్లయిన నీవు ముందుగా బ్రాహ్మణ కన్యనే వివాహమాడు. తదుపరి ఆ వేశ్యా కన్య చిత్రరేఖను వివాహమాడు.” అంటూనే తమ ఆస్థాన పూజారిని పిలిపించి ఆయన కుమార్తెను విద్యాసాగరునకిచ్చి పెళ్ళిచేయమన్నాడు. ఆయన అంగీకరించాడు. ఆ వెంటనే రాజు ముహూర్తాలు పెట్టించి బ్రాహ్మణ కన్యతో వివాహం జరిపించాడు. ఆ తదుపరి 'తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు. అదే సమయంలో కోశాధికారియైన వైశ్యుడు. సోమగుప్తుడు తన కుమార్తెను విద్యాసాగరుడుకిచ్చి పెళ్లి చేస్తాన'ని ముందుకివచ్చాడు. అమెనూ విద్యాసాగరుడు పెళ్ళాడాడు. ల తదుపరి వేశ్యకుమార్తెగా జన్మించిన చిత్రరేఖనూ వివాహం చేసుకున్నాడు. రాజు ఇచ్చిన తీర్పుతోనూ, చేసినవివాహాలతోనూ మదనరేఖకూడా కూతురు తోబాటు తృప్తిపడింది. నలుగురు భార్యలతోనూ కాపురాలు పెట్టాడు విద్యాసాగరుడు.
మహారాజుకి వృద్ధాప్యం రావడం జరిగింది. అల్లుడు అయిన విద్యాసాగరుడికి వారసత్వపు హితపు కలిగి వుండడంతో ఆయనకు రాజ్యం అప్పగించాడు. తదుపరి మహారాజు భగవధ్యానంకోసం అడవులకు వెళ్లిపోయాడు.
COMMENTS