Theerpu Story in Telugu Language: In this article, we are providing నేర్పు గల తీర్పు తెలుగు కథ. Telugu Moral Stories for kids and Students.
Theerpu Story in Telugu Language: In this article, we are providing నేర్పు గల తీర్పు తెలుగు కథ. Telugu Moral Stories for kids and Students.
Theerpu Story in Telugu నేర్పు గల తీర్పు తెలుగు కథ
విక్రమాధిత్యుడు తీర్పులు చెప్తున్న సమయంలో తనూ అంత నిష్పక్ష పాతంగా తీర్పులు చెప్పగలనని ప్రక్కవారితో అంటుండేవాడు కూడా దాంతో సభాస్థలిలోని కొందరిని సన్నిహితుల్ని చేసుకున్నాడు. వాళ్ళ ఎదుట తననుతాను పొగడుకుంటూండేవాడు. క్రమేపీ ఈ విషయం విక్రమాధిత్యునకు తెలిసింది. ఆ సమయంలో విక్రమాధిత్యుడు నవ్వి వూరుకునేవాడు.
ఒకనాడు రుషికేతు న్యాయస్థానంలో అడుగుపెట్టాడు అప్పుడు “బావ గారూ మీకు రాచరికపు దుస్తులు ధరించండీ. యువకుడుగా గాక ముసలివాడుగా తయారై న్యాయస్థానంకి రండీ" అనిచెప్పారు. “ఎందుకు? " అడిగాడుఋషికేతు.
“ఈ రోజున తీర్పులు నువ్వు చెప్పుదువు గాని” ! అన్నాడు విక్రమాధిత్యుడు. “మరి మీరు? ” అర్ధంకానట్లు చూసి ప్రశ్నించాడు రుషికేతు.
“మిమ్మల్ని అక్కడి పెద్దలకు పరిచయం చేస్తాను యేమనో తెలుసా వీరు పొరుగుదేశం నుండి వచ్చారు అంతేగాదు ఈ దేశంలో పేరొందిన న్యాయ నిర్ణేత! వీరిని పిలిపించిన కారణం మేయంటే నాకు యితరత్రా అతి ముఖ్యమైనటు వంటి పనులున్నాయ్ నేను వెళ్ళాల్సివచ్చివెడుతున్నాను. అని చెప్పేస్తాను” అన్నాడు విక్రమాధిత్యుడు. .
తన ప్రతిభను చాటుకునేందుకు వీలుంటుందని వెంటనే అంగీకరిం చాడు రుషికేతు. అందుకుఅంగీకరించారు. ఆ మర్నాడు విక్రమాధిత్యుడు చెప్పిన విధంగా రూపాన్ని మార్చుకొని సభకు వెళ్ళాడు. విక్రమాధిత్యుడు తను అన్న విధంగా రుషికేతుని అక్కడి వారికి పరిచయం చేశాడు. తీర్పులు చెప్పే బాధ్యతను అప్పగించి స్వయంగా న్యాయపీఠాన్ని అలంకరింపచేశాడు తను సభనుండి బయటికి వెళ్ళిపోయాడు విక్రమార్కుడు.
తదుపరి సభికులకు రుషికేతునకు తెలియకుండా తను మారువేష ధారియై వెళ్ళాడు. వచ్చినవాడు సభలో ప్రవేశించలేదు. చాటుగానున్న తెరలు ప్రక్కన నక్కి వున్నాడు.
ఒకడు మరొకరి కోడిపెట్టను అపహరించిన నేరం పరిష్కారం చేయవల్సి వచ్చింది అదే మొదటి కేసు అవతల వ్యక్తి నేరారోపణ చేసినవాడు అనగా కోడి పెట్టను దొంగిలించాడనడంతో ఆ దొంగతో నువ్వు మరొ కోడిపెట్టను కూడా దొంగిలించు అని చెప్పి పంపాడు. ఆ వెంటనే అక్కడున్న రాజభటులను ఉద్దేశించి యీ దొంగ రెండో కోడిపెట్టను దొంగిలించగానే వీడిని బంధించి రాజ సభకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ఆ దొంగ తలూపి వెళ్ళాడు.
“ఎందుకు స్వామి” అన్నారు అక్కడున్న మరో రాజోద్యోగి.
“వాడు ఆ పని చేశాకనే నా తీర్పు యిస్తాను” అని అన్నాడు రుషికేతు.
విక్రమాధిత్యుడు అవతలదాగివున్న సంగతి ఒక్క రుషికేతునకే తెల్సును! అనంతరం రుషికేతు విక్రమాధిత్యుడు దాగిన వేపు చూశారు.
అతను దొంగకు మరో కోడిపెట్టను దొంగిలించమని చెప్పడం, అతన్ని బంధించవద్దనిభటులకు ఆజ్ఞాపించడంతో సభికులు అందరూవింతగా చూశారు. కొద్ది వ్యవధి రావడంతో విక్రమాధిత్యుడు తను దాగిన స్థలానికి రుషికేతుని రమ్మని సైగ చేశారు. రుషికేతు వెళ్ళాడు.
రెండో కోడిపెట్టను దొంగిలించుకురమ్మనడంలో నీ ఉద్దేశం యేమిటి? అడిగారు విక్రమాధిత్యుడు.
“అందుకు గతంలో మీరు చెప్పిన తీర్పే కారణం. యేమంటే ఆ మధ్యన రెండు కోడిపెట్టలను అపహరించిన కేసు విచారణకు రాగా మీరు ఆ దొంగకు ఒకబంగారు నాణెంను అపరాధం క్రింద చెల్లించమన్నారు. అప్పుడు చెల్లించాడు. అదేరకమైన కేసు యిప్పుడువచ్చింది. అయితే వీడు ఒక కోడి పెట్టనే అపహరిం చాడు. అందుకని రెండో కోడిపెట్టను అపహరించి తెమ్మన్నాను. అప్పుడు వీడికి బంగారు నాణెం అపరాధం క్రింద చెల్లించమనవచ్చును. యిప్పుడు వీడు అపహరించింది ఒకే కోడిపెట్ట కనుక కోడితో బంగారు నాణెం చెల్లించమని యే విధంగా చెప్తాను. ఆ బంగారునాణెం ఎక్కడినుండి తేవాలి అందుకని రెండో పెట్టను కూడా అపహరించి తెస్తే రెండింటి మీదా మీ మాదిరే బంగారునాణెం చెల్లించవలసి వుంటుంది. అని జవాబు యిచ్చాడు రుషికేతు.
అతడు ఇవ్వనున్న తీర్పుకు విక్రమాధిత్యునకు నవ్వు వచ్చినది. వస్తున్న నవ్వును ఆపుకో ప్రయత్నించీ, ఆపుకోలేక నవ్వేశాడు.
విక్రమాధిత్యుని నవ్వుతో తమ తెలివి తక్కువ తీర్పుకు సిగ్గుపడ్డాడు రుషికేతు
COMMENTS