Shani Devudu Story in Telugu Language : In this article, we are providing "శనిదేవుడు తెలుగు కథ". "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids.
Shani Devudu Story in Telugu Language : In this article, we are providing "శనిదేవుడు తెలుగు కథ". "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids and Students.
Shani Devudu Story Bhatti Vikramarka Kathalu in Telugu
విక్రమాధిత్యుని పేరుకు ఎటువంటి చెడు రాకుండా భట్టి రాజ్యపాలన చేస్తున్న సమయంలో విక్రమార్కుడు ఒకనాడు కాళికాదేవి ఆలయమునకు వెళ్ళాడు. కాళికాదేవిని పూజించి స్తోత్రం చేశాడు.
అతని భక్తికి మెచ్చి దేవి ప్రత్యక్షమైంది "నృపాదిపా నిన్ను ఏడు సంవత్స రాలు శని పట్టి బాధిచుచున్నాడు. నువ్వు ధ్యానించినప్పుడు దర్శనమివ్వగలడు. అప్పుడు నీవతడి పాదములు కడిగి పూజించు. సంతుష్టుడుని చేయి అప్పుడు శని దేవుడు నిన్ను కనుకరించును. ఆయన చెప్పిన ప్రకారం నడుచు కొనుము. నీకు సర్వదా సుఖముకలుగును.” అని చెప్పి అంతర్ధానం అయ్యింది కాళికాదేవి.
తదుపరి బ్రాహ్మణరూపంలో శని దేవుడు వచ్చి విక్రమాధిత్యుని కలుసు. • కున్నాడు. “రాజా నేను శని దేవుడను నిన్ను ఏడు సంవత్సరాలు పట్టి బాధించే " వుద్దేశంతో వచ్చాను.” అని చెప్పాడు. అప్పుడు విక్రమాధిత్యుడు కాళి చెప్పినట్లు చేశాడు. తనను కనికరించమని మనవి చేసుకున్నాడు.
“అయితే నేను చెప్పినట్టు నడుచుకో” అన్నాడు.
“శెలవివ్వండి” అన్నాడు విక్రమాధిత్యుడు.
“నేను నిన్ను విడిచేటంతవరకు మధురకు పోయి నగరాధిపతి దగ్గర సేవకా వృత్తిలోమారు పేరునమసలుకొమ్ము”అని చెప్పి అంతర్గామయ్యాడు శనిదేవుడు.
జరిగినదంతా భట్టికి తెలియపరిచాడు. శనిదేవుడు చెప్పిన విధంగా ప్రయాణమై వెళ్ళాడు విక్రమార్కుడు.
మార్గమధ్యంలో కొంత సేపు విశ్రమించాడు. మరునాటి ఉదయం కాలకృత్యములు తీర్చుకున్నాడు. తిరిగి బయలు దేరాడు. మార్గమధ్యలో వికృతా కారంలో వున్న ఒక స్త్రీ కనపడింది. రాజేంద్రా నీవు మారువేషం ధరించిన గొప్పరాజువి. నేను మహేంద్రుని కొలువులో ఉండే అప్స్స రత్నమాలికను నీవు దేవలోకమునకు వచ్చినప్పుడు నన్ను మోహించావు. నేను నిన్ను మోహిం చాను. ఈ సంగతిని మహేంద్రునికి యెరింగించితిని. శనిదేవుడు పీడించే సమయంలో పసిగట్టి వెళ్ళమన్నాడు వచ్చితివి. నన్ను ఇంద్రుడు పంపాడు. కనికరించి నా కోరికను తీర్చు”
“ఏమంటివీ నీవు మహేంద్రుని వద్ద ఉండే మాలికవా ? ఇంత కురూపిగా ఎందుకు ఉన్నావు. నిన్ను ఏ విధంగా నమ్మాలి రత్నమాలిక చాలా చక్కనిది కదా” అన్నాడు విక్రమాధిత్యుడు.
“రాజా ! ఏమి చెప్పను శనిగ్రహ పీడుతుడుగా నువ్వు దేశాలు పట్టి తిరుగుతున్నావు. నా అందాన్ని చూసి మోహించని వారెవరు ? అందువలన పగటి సమయంలో కురీపిగాను, రాత్రి సమయంలో యధారూపంలోను ఉంటాను. ఇంద్రుడే ఈ విధమైన పద్ధతిని ప్రసాదించాడు. సంశయింపక నన్ను నమ్ము. నా యధారూపమును చూడండి. అని తన యధారూపమును చూపించింది రత్నమాలిక.
ఆ సౌందర్యరాశిని చూచి ఆనందభరితుడైనాడు. వెంటనే ఆమెను కౌగిలించుకున్నాడు. తిరిగి ఆమె వికృతరూపంలోనికి మారింది. విడవకుండా విక్రమార్కుడుని అనుసరించింది. ఆ ఇద్దరూ వెళుతుండగా వారలకు నీటి మడుగు కనిపించింది. ఆమెను ఒడ్డున ఉండమని విక్రమాధిత్యుడు దప్పిక తీర్చుకునే నిమిత్తం మడుగులోకి దిగాడు.
అదే సమయంలో ఒక సర్పం కప్పను పట్టుకొన్నది. అది చూసాడు విక్రమార్కుడు. కప్పకు ప్రాణహాని కలగనున్నదని గ్రహించాడు. వెంటనే కత్తిని దూసి తనతొడను కోసాడు. ఆ మాంసమును పాముమీదకు విసిరాడు. అప్పుడు పాము నోటపట్టిన కప్పను విడిచి మాంసమును పట్టుకున్నది. ఆ విధంగా కప్ప ప్రాణాలు కాపాడగలిగాడు. పాము కప్ప మనుషులుగా మారారు.
“రాజా నా పేరు అనంతుడు. కప్ప జలందరుడు మేమిద్దరం విద్యాధికులం ఒక ముని శాపమున ఈ మడుగులో పడివున్నాము. శాప విమోచనకు విక్రమార్కుడు వచ్చి తన మాంసమును ఆహారముగా వేసినప్పుడే మీకు శాపవిమోచన అవుతుందని అప్పుడు చెప్పాడు ముని. మారువేషదారిగా ఉన్న తమరు విక్రమాధిత్యుడు అని చెప్పకనే తెలుస్తున్నది. ఉజ్జయినికి వెళ్ళిన తదనంతరం మీకు శాప విముక్తి కలుగుతుందని అన్నాడు ముని. ఈనాడు మీ రాకతో మీకు శాపవిమోచనం కలిగిందని అన్నారా విప్రులు.
COMMENTS