Sahayam King Vikramaditya Story in Telugu Language: In this article, we are providing సహాయం తెలుగు కథ. Bhatti Vikramarka Kathalu in Telugu for kids.
Sahayam King Vikramaditya Story in Telugu Language: In this article, we are providing "సహాయం తెలుగు కథ". "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids and Students
Sahayam King Vikramaditya Story in Telugu Language
విక్రమార్కుడు కంచి పట్టణంలో ఒక వీధి వెంట వెడుతున్నారు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు వంతెన మీద కూర్చుని దుఃఖిస్తున్నాడు. అతన్ని చూసి విక్రమార్కుడు సమీపించాడు. “ఎందుకు ఏడుస్తావ్” అని అడిగాడు.
ఆ బ్రాహ్మణుడు జవాబు యివ్వక యేడుస్తూనే వున్నాడు. విక్రమాధి త్యుడు మళ్ళీ అడిగాడు.
బ్రాహ్మణుడికి విసుగు జనించింది. “అయ్యా నేను ఎందుకు యేడుస్తు న్నానో మీకెందుకు ? నువ్వేమన్నా తీరుస్తావా!” అన్నాడు చిరాకుగా ఏడుస్తూనే.
“నాకు చెప్పినందువలన నీకు వచ్చే నష్టంగానీ కష్టంగానీ లేదుకదా” అడిగిన వాళ్ళకు చెప్తే యెవరో ఒకరు మీ సమస్యకు సరి అయిన మార్గంను చూపకపోరు కదా !" అన్నాడు మారువేషంలో వున్న విక్రమాధిత్యుడు.
“వినండి ! చెప్తున్నాను” ఏడుపు దిగమింగి యీ విధంగా చెప్పాడు.
“నా తండ్రి యెంతో ధనం సంపాదించారు. అయితే నేను చిన్న వయస్సులో వుండగానే ఆయన మరణించాడు. నేను పెద్దవాడినైనాను. ఆమధ్యన నాకొక చీటీ దొరికింది. అందులో జయనామ సంవత్సర ఆషాఢ శుక్ల దశమినాడు రాత్రి పదిగంటల ప్రాంతంలో కంచి పెద్ద గోపురం మూడవ అంతస్తుకి సరిగ్గా రెండు నిలువుల లోతు తవ్విన అందులో పోసి వుంచిన అయిదులక్షల వరహాలు దొరుకును అని వ్రాసి ఉంది. ఏ విధంగా తవ్వాలి : అన్నదే నా సందేహం. అయిదు లక్షల వరహాలు అంటే మాటలు కాదుకదా ! . గోపురం మూడో అంతస్తుకి రెండు నిలువుల గోతిని తవ్వడం సాధ్యమా ! అసలు ఆ డబ్బుని నా తండ్రి వేరొకచోట దాచినట్లు వ్రాశాడేమోననిపిస్తోంది. కనీసం ఆయన దాచిన ధనాన్ని కంటిలో చూశేటందుకైనా నోచుకోని దౌర్భాగ్యుడను. అదే బాధతో ఏడుస్తున్నాను.” అని చెప్పి మళ్ళీ ఏడవసాగాడు.
విక్రమాధిత్యునకు అది చిక్కు సమస్యలా తోచింది. అంతస్తుదగ్గర తవ్వడమేంటి క్రింద తవ్వడమే అసాధ్యం. ఇందులో ఏదో కిటుకు వుండి తీరాలి. ముందు దానిని తెలుసుకోవాలి. అని ఆలోచిస్తున్నాడు. ఈ
ఏడవకు బ్రాహ్మణోత్తమా ఏడవకు “అంటూ దానికి మార్గం నేను చెప్తాను.” అన్నాడు. ఆ బ్రాహ్మణునకు శరీరం తేలికయింది “మీరు చెప్తారా !” అన్నాడు. ఆశ్చర్యంగా “అవును” చిన్నగా నవ్వి అన్నాడు మారువేషంలో వున్న విక్రమాధిత్యుడు.
శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాను. కారణంగా లేనిదే ఎవ్వరూ ఏమీ చెప్పరు. ఇందులో ఏదో కిటుకు ఉంది. అదేదో నేను తెలుసుకుంటాను. ఇంటికి పద. తీరిగ్గా మాట్లాడుకుందాం పద” అని బ్రాహ్మణుడిని వెంటపెట్టుకుని వెళ్ళాడు విక్రమాధిత్యుడు.
ఆ రాత్రంతా ఆలోచించాడు. విషయం బోధపడింది. అతనికి వివరం చెప్పకుండా అతను చెప్పింది, చీటిలో ఉన్నది మరలా గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ రోజు బ్రాహ్మణ కుమారుణ్ణి వెంటపెట్టుకొని నిర్ణీత ప్రదేశానికి వచ్చాడు. మరొకసారి అంతా పరిశీలించి చూశాడు విక్రమాదిత్యుడు.
బ్రాహ్మణుడికి ఎటూ పాలుపోక కళ్ళప్పగించి చూస్తున్నాడు. విక్రమార్కుడు గోపురం వెన్నెల సమయంలో గోపురం మూడో అంతస్తు నీడ ఎక్కడ పడుతుందో తెలుసుకున్నాడు. ఆ స్థలంలో రెండు నిలువులు లోతు తవ్వించాడు. అంతే వరహాల మూట బయట పడింది. దానిని బ్రాహ్మణునకు ఇచ్చాడు. బ్రాహ్మణకుమారుడు మిక్కిలి ఆనంద భరితుడైనాడు. మారువేషదారి అయి ఉన్న విక్రమాధిత్యుని ఎంతో పొగిడి తను కొంత పైకం ఇవ్వబోయాడు.
మారువేషంలో ఉన్న విక్రమాధిత్యుడు నిరాకరించాడు. క్షేమంగా ఇంటికి వెళ్ళమని చెప్పి తన దారిన తను వెళ్ళిపోయాడు.
COMMENTS