Sahajagunamunu Kolporad Kasi Majili Story in Telugu : In this article సహజగుణమును కోల్పోరాదు మజిలీ కథలు, Kasi Majili Stories in Telugu" for kids.
Sahajagunamunu Kolporad Kasi Majili Story in Telugu Language : In this article read "సహజగుణమును కోల్పోరాదు మజిలీ కథలు", " Kasi Majili Stories in Telugu" for kids and Students.
సహజగుణమును కోల్పోరాదు మజిలీ కథలు
గురు శిష్యులు మజిలీలు చేసుకుంటూ ఒక ఊరిపొలిమేర వద్దకు వచ్చారు. అక్కడొక యోగి తపస్సుచేసుకుంటూకనిపించాడు. అంతటశిష్యులు గురువుగారూ! ఈయనెవరు?ఎందుకుతపస్సుచేస్తున్నారు?”అనిఅడిగారు గురువుగారిట్లు చెప్పసాగారు.
నాయనలారా! ఈయనొక గొప్పతపఃశ్శక్తి సంపన్నుడు. ఈయనకి తెలియని దంటూ ఏమీ ఉండదు. సర్వ విద్యలూ తెలిసినవాడు. అంతేకాదు ఈతనికి జంతు భాషకూడా వచ్చును. (అంటే జంతువులభాష) కొంచెంసేపు ఆగండి ఈయననే అడిగి కొన్ని ధర్మసూత్రాలు తెలుసుకొందాం ! అన్నాడు సరే నన్నారు శిష్యులు.
కొంత సేపటికి ఆ యోగి కళ్ళు తెరిచి ఎదురుగానున్న గురుశిష్యులను చూసాడు. “ఎవరుమీరు? ఎందుకిలావచ్చారు? ” అనిఅడిగాడు. అంతట గురువు గారు “మహాత్మా ! శిష్యులతో కలిసి కాశీయాత్రకు పోవుచున్నాము. మార్గ మధ్యంలో మీరగుపించారు. మీ వలన కొన్ని ధర్మ సూక్ష్మములను వినాలనే కుతూహలంతో ఉన్నాము సెలవీయండి " అన్నాడు.
“నాయనలారా! వినండి! ఈ సకలచరాచర జీవరాశులు తమ తమ స్వభావ సిద్ధమైన సహజగుణములను వీడరాదు. సహజగుణమును విడనాడిన ప్రతి ప్రాణి పలు ఇబ్బందులకు గురౌతుంది. శ్రమ తెలియకుండా ఉండేందుకు మీకొక చక్కని ఉదాహరణ చెబుతాను వినండి.
నేనొకనాడు స్నానమాచరించుటకు కోనేటికి పోవుచుండగా దారిలో నా మార్గానికడ్డంగా ఒక విషసర్పం ఉండటం కనిపించింది. వెంటనే నేను "ఓ విష సర్పమా! నేను నిన్నెట్లుదాటిపోగలను? నిన్ను దాటుట మంచిదికాదు. నీవు ప్రక్కకు తొలగిపోయినచో నేనుపోయి స్నానమాచరించగలవాడను. తపఃశ్శాలినైన నేను నీకు భయపడను కాని నిన్ను చూసిన వారందరూ భయపడిపోతారు. కారణం నీ విషస్వభావమే. మంచిగామారి యశస్సును పొందు” అన్నాను.
ఆనాటినుండి నేను చెప్పిన మాటలను ఆలకించిన ఆ సర్పరాజము మంచిగా మారిపోయింది. నా మాటలతో ఆ సర్పరాజుకి జ్ఞానోదయమైంది. సాధుస్వభావిగా మెలగాలనుకొంది. వెంటనే మంచిగా మారిపోయింది. నాటి నుండి ఆసర్పంసాధుస్వభావిగా మెలగడొచ్చింది. ఎవ్వరినిఏమీచేసేదికాదు. అంటే ఎవ్వరిపై బుసకొట్టేదికాదు.ఎవరెంత హింసించినా తప్పుకుపోయేదేకాని ఎదురు తిరిగేదికాదు.
ఒకనాడు సర్పం తన ఆహార సంపాదనకై పుట్టనుండి బయటకు వచ్చింది. దానిని చూచిన కొందరుకాపరులు భయపడుతూకొట్టసాగారు. ఎవరెంత హింసించి ననూ ఎదురుతిరగని ఆ సర్పము వారికి లోకువైపోయింది. పశువుల కాపరులు, పిల్లలు అందరూలోకువకట్టి సర్పాన్ని పుట్టలోనుండి బయటకు తీసి తోకతో నేలనేసి కొడుతూ, ఆడుకుంటూ హింసించసాగారు. తనకెంతటి గాయాలైనాసరే ఓర్చుకొని, చిక్కిశల్యమై సాధుస్వభావిగానే మెలగసాగింది. ప్రతిసారీ మహర్షి నామాటలు జ్ఞప్తికి తెచ్చుకుంటూఎదురుతిరిగేదికాదు. దాంతో అది ప్రజలకు లోకువైపోయింది. తీవ్ర ఇబ్బందులు పడుతూ, ముక్కుతూ, మూల్గుతూ జీవించసాగింది.
ఇలాఉండగా కొన్నాళ్ళకు నేను మరలనదీస్నానానికి పోతు సర్పరాజమును చూడటం తటస్థించింది. ఓహో ! సర్పరాజమా ! ఎలా ఉన్నావు? అంటూ అరెరే ! ఏమైంది నీకు! ఇలా చిక్కిశల్యమైపోయావేమిటి? నిన్నీస్థితికి తెచ్చిందెవరు? అంటూ ప్రశ్నలవర్షం కురిపించాను.
"అయ్యా! మహానుభావా! ఏమని చెప్పను? ఇంతకుముందు మీరు నాకు హితబోధచేసితిరిగదా ! దాని ప్రభావవే ఇది. నేను మంచిగా, సాధుస్వభావిగా మారినందుకీ శిక్ష అనుభవించవలసి వస్తోంది. అందరూ నన్ను చులకనగా చూసి లోకువకట్టి నాతో బొమ్మలాట ఆడుకుంటున్నారు. రోజు రోజుకు క్షీణించిపోతూ ఉన్నాను. పుట్టలో చెయ్యిపెట్టి మరీ లాగుతున్నారు నన్ను ! ఏం చేయాలో పాలు పోవటంలేదు" అని దీనంగా చెప్పింది.
అంతటనేను “ఓసి నీ తెలివి తెల్లారిపోనూ ! నిన్ను సాధు స్వభావిగా ఉండ మన్నానేగాని నీ సహజగుణమైన స్వరక్షణను వదలివేయమన్నానా? మన జీవితాన్ని మనం రక్షించుకొనకపోతే మరెవ్వరు రక్షిస్తారు. భగవంతుడు ప్రతి ప్రాణికి స్వరక్షణా గుణమునిస్తాడు. నీసహజసిద్ధమైన స్వరక్షణాగుణము బుసకొట్టడమే. అనవసరంగా అందరినీ కాటువేసిచంపవద్దన్నానుకాని బుసకొడుతూ నిన్ను రక్షించుకోవద్దన్నానా? బుసకొట్టి భయపెట్టి, ప్రాణరక్షణగావించుకొనటం సర్పాలసహజలక్షణం అదివీడి ప్రాణం మీదికి తెచ్చుకున్నావు. ఇప్పటికైనను మించిపోయింది లేదు. బుసకొట్టి భయపెట్టు. సాధుస్వభావినివై కాటువేయకు. నీకంతామేలేజరుగుతుంది” అని దీవించాను!
ఆ నాటినుండి యధాప్రకారంగా బుసకొడుతూ, భయపెడుతూ బ్రతక సాగింది. బుసకొట్టడంచూసిన ప్రజలందరూ దాని దరిదాపులకు వచ్చేవారే కారు. అనతికాలంలోనే అదితనపూర్వవైభవాన్ని సంతరించుకొని, సాధుస్వభావియై అంత్యమున ముక్తి నొందెను. అని చెప్పాడు యోగి. గురుశిష్యులు మరునాడు తమ ప్రయాణాన్ని యధావిధిగా కొనసాగించారు.
COMMENTS