Adrusta Deepuni Adbuta Charitra Story in Telugu Language : In this article అదృష్ట దీపుని అద్భుత చరిత్ర కథ, Kasi Majili Stories in Telugu for kids.
Adrusta Deepuni Adbuta Charitra Story in Telugu Language : In this article read "అదృష్ట దీపుని అద్భుత చరిత్ర కథ", "Kasi Majili Stories in Telugu" for kids and Students.
Adrusta Deepuni Adbuta Charitra Story in Telugu అదృష్ట దీపుని అద్భుత చరిత్ర కథ
పూర్వము దీపకాంతుడనే రాజుండేవాడు. అతని భార్యదేవేరి. రాజు, రాణి ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకొనేవారు. వారికి లేకలేక ఒక కొడుకుపుట్టాడు. కొడుకు పుట్టినవేళావిశేషమేమోగాని, కొన్నిరోజులకు శతృరాజులొచ్చి ఆ దేశంపై దండెత్తి రాజ్యాన్ని వశపరుచుకున్నారు. దీపకాంతుడు బందీఅయ్యాడు. అంతఃపురంలోనున్న రాణీకి ఈ విషయంతెలిసి. తనకొడుకును ఒక దాది కిచ్చి పెంచమని చెప్పింది. తాను మాత్రం రహస్యమార్గం గుండా తప్పించుకొని పారిపోయింది.
దాది తన చాకచక్యంతో శతృరాజుల కంటబడకుండా తప్పించుకొని, అతిప్రయాసతో ఒక అడవికి చేరింది. నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరుకొని ఒక మర్రిచెట్టు క్రింద విశ్రమించసాగింది. అలసిపోయిందేమో, ప్రక్కనే బిడ్డను పెట్టుకొని నిద్రించసాగింది. ఇంతలో చెట్టు తొర్రలోనుండి ఒక భయంకరసర్పము బయటకు వచ్చి, గుర్రుపట్టి నిద్రిస్తున్నదాదిని కాటువేసి ప్రక్కనే ఉన్న బిడ్డను చూసి ఎండపడ కుండా పడగపట్టింది. పాముకాటుకి దాది నురగలుగ్రక్కుకుంటూ చనిపోయింది. కొంత సేపటికి బిడ్డ ఆకలికి కేవు కేవు మంటూ ఏడ్వసాగింది.
ఆ ప్రాంతంలో పశువులు కాస్తున్న గొల్లపిల్లలకు ఆకేకవినిపించింది. బిడ్డ ఏడుపు విన్న గొల్లపిల్లలు మర్రిచెట్టుదగ్గరికి వచ్చారు. పడగపట్టినపామును అదలించి వెళ్ళ గొట్టాడు. బిడ్డనుఎత్తుకొన్నారు. దాదిచనిపోయిందనినిర్ధారించుకొని, ఆ శిశువుతో సహా ఊరిలోనికి వచ్చి జరిగిందంతా తమ కులపెద్దలకు చెప్పారు. ఆకుల పెద్ద ఆ బాలుని ఎత్తుకొని, తనకు సంతానంలేక పోవటంతో అల్లారు ముద్దుగా పెంచుకో సాగాడు. అసలే గొల్లలేమో! వెన్న, మీగడలతో, పాలు పదార్థ ములతో బాలుడు ముద్దుగా బొద్దుగా పెరుగసాగాడు. సర్పనీడ పట్టినవాడు అదృష్టవంతుడౌతాడు. యావత్ప్రపంచానికి గొప్ప చక్రవర్తి కాగలడు”. అని పెద్దలు చెబుతుంటే వినిమురిసి పోయేవాడు. నిత్యము పిల్లవానితో ఆడుకుంటూ ఆనందించేవాడు. బాలునికి అదృష్ట దీపుడని పేరు పెట్టుకొని ముద్దుగా పిలుచు కుంటూ ఉండేవారు. సంతానంలేక పోవటంవల్ల అదృష్టదీపుని అతిగారాబంగా పెంచసాగారు.
అదృష్టదీపునికి అయిదేళ్ళు నిండాయి. అంటే చదువుకొనే వయస్సు వచ్చిందన్న మాట. పల్లెలోనిబడిలోవేసారు. ఏకసంథాగ్రాహిఅయిన బాలుడు చదువులో దిట్ట అయ్యాడు. మంచి ఉత్సాహము, చురుకుదనమునేర్పరితనము అలవడ్డాయి. ప్రతిపనిని ఇట్టే సులువుగా చేసేవాడు. ఆతని బుద్ధి సూక్ష్మతకు అందరూ ఆశ్చర్యపడే వారు. మంచి ఆకర్షణీయమైన, అందమైన దస్తూరి అలవడింది. అతిత్వరలోనే ఆపల్లెకంతకూఅభిమానపాత్రుడయ్యాడు. ఎనిమిదేళ్ళువచ్చాయి. అదృష్టదీపుని తోటి పిల్లలతో పశువులు కాయటానికి పంపారు. పగలంతా పశువులను మేపి రాత్రివేళకు ఇంటికి చేరడం ఆతని నిత్య కృత్యమైంది. నానమ్మలు, అవ్వలు రాత్రివేళ ఆతనికి మంచిమంచిరాజులకధలు చెప్పేవారు. అదృష్టదీపుడువాటినివంటపట్టించుకున్నాడు. తగినంత జ్ఞానాన్ని సంపాదించాడు. అన్ని విషయాలను ఇట్టే ఆకళింపు చేసుకొనేవాడు. క్రమంగా పెరిగి పెద్దవాడవుతూ పదేళ్ళ ప్రాయాన్ని సంతరించుకొన్నాడు. ఆతని చిన్న బుర్రలో ఎన్నెన్నో ఆలోచనలు రాసాగాయి. అతడిట్లా అనుకోసాగాడు. కథలు విన్నతర్వాత నాకొకటి అనిపిస్తుంది. ఈ భూమిపై ఎన్నెన్నో పల్లెలు,పట్నాలు, నగరాలు, రాజ్యాలు ఉన్నాయన్నమాట, అట్లేరాజులు, మంత్రులు, సేనలు,రైతులు, వివిధరీతుల వారున్నారన్నమాట. మరి వీరేమిటి? ఇలా ఉన్నారు. వీరిచేష్టలు, రూపాలు కూడా చిత్రంగా ఉన్నాయే. మరినేను వీరిలా లేనేమిటి? నాకెందుకింత అందమైన సుందరా కృతివచ్చింది. ఎట్లాగైనా సరే ! ఈ ఊరికినేను ముఖ్యుడనవ్వాలి అని ఆలోచించాడు.
తన. ఆలోచనను కార్యరూపంలో పెట్టదలచి, తోటి పిల్లలందరిని పిలిచి ఒరేయ్! నేటినుండి మనమొక మంచి ఆటఆడదాం. నేనీ ఆటను మీకు నేర్పుతాను. దానివల్ల మనకు తెలివితేటలుకూడా వస్తాయి. అనవసరంగా కాలాన్ని వృధా చేయడమెందుకు ? వినండి ! ఈ ప్రాంతమంతా ఒక రాజ్యం . దీన్ని పాలించే రాజును నేను. నాకు మీరు మంత్రులుగా, సేనాధిపతులుగా భటులుగా ఉండాలి. మిగిలినవారంతా ప్రజలు. రాజలు రాజ్యాన్నెలాపాలిస్తారో అట్లే మన ఆటకూడా ఉంటుంది. సరేనా ! అన్నాడు. ఆతనిమాటలకు అందరూ సంతోషంతో చప్పట్లు చరిచారు. ఈ ఆట భలే విచిత్రంగా ఉందే !అనుకున్నారు. రాజులు, మంత్రులు మున్నగువారు కూర్చోటానికి కర్రలతో సింహాసనం, ఆసనాలు చేయించాడు. చక్కటి ప్రాంతాన్ని ఎన్నుకొని, శుభ్రంచేసి ఒక మర్రిచెట్టు క్రింద సింహాసనాన్ని దానికి అటుఇటూకొంచెం ఎడంగా మంత్రులు, సేనాధిపతుల ఆసనాల్ని వేయించాడు. ఒక రాజదర్బారు మాదిరిగా అమర్చాడు తాను రాజుగా సింహాసనంపై కూర్చొని ఎవరెవరు ఎలా మెలగాలో నేర్పించాడు. రోజుకొక పిల్లవాణ్ణి పశువులను మేపేటట్లు నియమించేవాడు. ఖాళీగా ఉన్న మిగిలిన పిల్లలను ఆటలో ప్రవేశపెట్టేవాడు. చక్కగా రాజ్యపరిపాలన చేస్తున్నట్లు తప్పుచేసినవారికి శిక్షలు విధిస్తున్నట్లు! “నేరాలను విచారిస్తున్నట్లు, ఉద్యోగ నియామకాలు చేస్తున్నట్లు” ఇలా రాజ్యపాలన చేస్తున్నట్లుగా ఆడుకొనేవారు. పగలంతా ఆటలు ఆడుకోవటం, రాత్రయ్యేసరికి పల్లెలోనికిపోవడం వారి నిత్యకృత్యమైంది. ఎప్పుడైనా పెద్దవాళ్ళు పట్నంపోయి వింతవస్తువులేవన్నా తెస్తే వాటినికూడా తమ ఆటకు వినియోగించేవారు. మారుమూల పల్లెకావటం వలన ఎవరూ అక్కడికివచ్చేవారుకారు.
ఇలా ఉండగా ఒకనాడు సింధుదేశపురాజైన మదనసింహుడు వేటకోసం అటుగా వచ్చి శిబిరాలు వేయించాడు. ఈ విషయం అదృష్ట దీపుడికి తెలిసింది. వెంటనే తెలివిగా తన ప్రాంతంలో దొరికే వెదురుబియ్యం, తేనె, రత్నాలు మున్నగు వాటినితనభటులద్వారా ఆయనకు పంపుతూ లేఖరాసాడు. “సింధుదేశపు రాజుగారికి సుస్వాగతం, మీవంటివారు మాప్రాంతాన్ని దర్శించటం మాఅదృష్టం, మేము మీతో సఖ్యత పాటిద్దామనుకుంటున్నాం. ప్రస్తుతం మేముఅత్యవసర రాజకీయ కార్యముపై వున్నందునమిమ్ములను దర్శించుకోలేకపోతున్నాము. మారాజ్యనియమము ప్రకారం క్రొత్తవారెవరైనామాప్రాంతానికి వస్తే శిస్తు కట్టవలసి ఉంటుంది. కాని మేము మీ మైత్రిని అభిలాషిస్తున్నాము కనుక ఆఅవసరంలేదు. మీరు మాకానుకలు స్వీకరిం చండి. ఇట్లు అదృష్టదీపుడు - అమరావతి చక్రవర్తి” అని వ్రాసి పంపాడు.
కానుకలు స్వీకరించిన సింధురాజు మిగులసంతసించాడు. చక్రవర్తి యంటే మహారాజుకంటే గొప్పకదా! యనుకొని చక్రవర్తిచేసిన మర్యాదకు మిక్కిలి సంతసించి అంతకు రెట్టింపు కానుకలను పంపాలనుకొని ఒక ఏనుగును, రెండు ఒంటెలను, నాలుగు గుర్రాలను, పలురకాలైన పట్టుబట్టలను మణిమయ ఖడ్గాలను పంపుతూ మనిద్దరిమైత్రి కలకాలం వర్ధిల్లుగాక ! అని లేఖరాసిపంపాడు. "
అదృష్టదీపుడు తను అనుకున్నట్లుగానే జరిగిందని తలంచి ఆ సింధురాజు పంపిన కానుకలలో కొంత భాగాన్ని నేపాలరాజుకు పంపుతూ ఎప్పటివలెనే లేఖరాసి పంపాడు. నేపాలరాజు సంతోషించి మరల కొన్ని అద్భుతకానుకలను పంపాడు. వీటిలో కొంత భాగాన్ని విదర్భదేశానికి పంపాడు. ఆయన మరలకానుకలు పంపిం చాడు. ఇలాతనకు తెలుసున్న రాజులందరకు ఒకరికానుకలను మరొకరికి పంపుతూ
మంచి పేరుప్రఖ్యాతులు సంపాదించాడు. వచ్చినకానుకల్లో కొంత భాగాన్ని ఉంచు కోవటం వలన అదృష్టదీపుడికి ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, మణిమాణిక్యాలు, రత్నాలు,పట్టుబట్టలుమున్నగునవెన్నోసమకూరాయి.వాటితో దానధర్మాలుచేయటం, ప్రతిరాజ్యకూడలిలో సత్రాలు కట్టించటం, చెరువులు త్రవ్వించటం, రోడ్లువేయిం చటం ప్రజోపయోగపనులెన్నింటినోచేసి అదృష్టదీపుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు. ఎక్కడ చూసినా అదృష్టదీపచక్రవర్తి యొక్క గుణగణములను శ్లాఘించే చర్చలే. అనతి కాలంలోనే అదృష్టదీపునికి రాజులందరూ మిత్రులయ్యారు. అతని పేరు ప్రఖ్యాతులు నలుదిక్కులా వ్యాపించాయి.
ఒకనాడు రాజులందరు కాశీ పుణ్యక్షేత్రంలో జరిగే విశ్వేశ్వరపూజా మహోత్స వానికి విచ్చేసారు. అక్కడ రాజులందరు ఎవరికివారే అదృష్టదీపచక్రవర్తి మాకు మిత్రుడంటే, మాకు మిత్రడని గర్వంగా చెప్పుకోసాగారు. ఇంతటి ఆధ్యాత్మిక పూజా మహోత్సవానికి అదృష్టదీపుడు కూడా వస్తాడని ఊహించారు. కానివారిఆశ అడి యాసే అయింది. కాశీలో అదృష్టదీపుని పేర నాలుగు పెద్ద పెద్ద సత్రాలున్నాయి. అవి అన్నీ చక్కగానడుస్తున్నాయి. అదృష్టదీపుని వివరాలుతెలుసుకోవాలని రాజు లందరు ఆసత్రములవారినివాకబుచేసారు. వారు కూడా మాకు తెలియదన్నారు. మేము ఉద్యోగస్తులము, మేము ఆయనను చూడలేదు అన్నారు. ఇంక ఇది కాదను కొని ప్రపంచ పటాన్నొకదానిని తెచ్చి అమరావతి చక్రవర్తి-అదృష్టదీపుని రాజ్యమెక్క డుందోనని క్షుణ్ణంగా పరిశీలించారు. అయినా వారేమీకనుక్కోలేకపోయారు. ఇంక చేసేదిలేక మరల అతనిమనుషులు కానుకలు తెచ్చినపుడు తప్పక ఆయన వివరాలు తెలుసుకోవాలనుకొన్నారు.
ఒకనాడు మాల్యదేశపు మహారాజుకు అదృష్టదీపచక్రవర్తినుండి పదివేల గుర్రాలు, అయిదువేల ఒంటెలు, వేయివేనుగులు, మేలిరకం రత్నాలు కానుకగా పంపాడు. వాటిని స్వీకరించిన రాజు ఆయనపంపిన కానుకలకంటే నేను పంపే కానుకలు మరింత ఘనంగా ఉండాలని మరికొన్ని ఏనుగులను గుర్రాలను మున్నగు వాటిని జోడించి పంపుతూ మీ రాజుగార్ని ఒకసారి దర్శించాలను కొంటున్నాం. ఆ మహాపురుషుని దర్శించుట మహద్భాగ్యంగా తలుస్తున్నాం. ఆ మహానుభావుని రాజ్యం అమరావతి ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి ఒకవేళమేము మీతో రావచ్చునా! అని అడిగాడు. అంతటభటులు మీ అభిప్రాయాన్ని లేఖద్వారా ఆయనకు తెలియ పర్చండి. అనుమతి కోరుతూ లేఖ వ్రాసి పంపితే మీభటులచేతనే సమాధానంపంపిస్తాం. అన్నారు.
రాజుగారి భటులు, తమ భటులతోసహావస్తున్నారని వేగుల ద్వారా విన్న అదృష్టదీపుడువారొస్తే తనరహస్యంబట్టబయలవుతుందనితలంచి, అదృష్టదీపమహా రాజుగారు ప్రస్తుతం తీర్థయాత్రాలలో ఉన్నారు. వారు తిరిగివచ్చిన వెంటనే మీకు కబురు చేయగలమని ఒక లేఖ తయారుచేయించి మధ్యదారిలోనే ఆ రాజభటులు తిరిగి వారి రాజ్యం పోయేటట్లు ఏర్పాటుచేసాడు. చక్రవర్తిలేని అమరావతికిపోవట మెందుకని వారు వెనుదిరిగిపోయారు. అదృష్టదీపచక్రవర్తి యొక్క భటులు చేసిన మర్యాదలకు అబ్బురపడిన మాల్యదేశభటులు చక్రవర్తిని గురించి మరెంతో ఘనంగా చెప్పుకొన్నారు. దీంతో అదృష్టదీపుడు అఖండమైన ఖ్యాతినార్జించాడు.
అదృష్టదీపునికి యుక్తవయస్సువచ్చింది. పద్దెనిమిదేళ్ళు నిండాయి. అతనిలో ఎప్పటినుండియో పీడిస్తున్న సందేహాలను నివృత్తిచేసుకోదలచాడు. ఒకనాటి రాత్రి నెమ్మదిగా అవ్వదగ్గరకు చేరి అవ్వా! నీ కధలవల్ల గొప్ప జ్ఞానాన్ని సంపాదించాను. ఇక్కడే వుంటూ ప్రపంచమంతటినీ ఆకళింపుచేసుకోగలుగుతున్నాను. నాకుకూడా బయటకు పోయి దేశాలు చూడాలని ఉంది. నేను గ్రుచ్చి గుచ్చి అడుగుతున్నానను కోక నేనొక ప్రశ్న అడుగుతాను. మర్మంలేని సమాధానం చెప్తావా? అసలు నేను మీ వాడినేనా! నేనెక్కడ పుట్టాను. నా జన్మవృత్తాంతం చెప్పి పుణ్యం కట్టుకో ! అని బ్రతిమాలాడు. అదృష్టదీపుని ఆరాటం ఆ అవ్వమనస్సును కలచివేసింది. ఇంక దాచడమెందుకని అతడు తనకెలా దొరికాడో మొత్తం వివరించింది.
"అవ్వా! నేనొక అడవిలో దొరికానా ! నా పై ఎండపడకుండా ఒక సర్పం తన పడగవిప్పి నీడనిచ్చి కాపాడిందా ! మరి పాముకాటుతో మరణించిన ఆమె ఎవరు? నాకన్న తల్లియా !కాదు కాదు ఆమె నా కన్నతల్లి అయితే నన్ను కాపాడిన సర్పము. నాతల్లి నెందుకు కాటువేస్తుంది. కావున ఆమె నాతల్లి కానే కాదు. మరి నా తల్లి ఎవరు? నా తండ్రి ఏమయ్యాడు. చనిపోయిన ఆమె ఎవరు ? నా కసలు బంధువులే లేరా ! అనుకుంటూ ఈ ప్రశ్నలకు సమాధానాలు శోధించాలి. అనుకొని ఒక శ్రేష్టమైన గుర్రమునెక్కి బయలుదేరాడు.
అలా బయలుదేరిన అదృష్టదీపుడు చివరకొక రాజ్యం చేరుకున్నాడు. అది విదర్భదేశపు రాజధాని అయిన ధర్మపురం. తనుకట్టించిన సత్రంలోనే అతనక్కడ బస చేయవలసి వచ్చింది. ఆ సత్రంలో అదృష్టదీపుని గురించి అందరూ శ్లాఘిస్తుంటే విని ఎంతగానో సంతోషించాడు. ఆ రాజధానిలో అందరూ అమరావతి చక్రవర్తిని పొగడటమే. నగరపర్యటనలో ఆతనికొకవిషయం తెలిసింది. ఆనగరానికి ఒక గొప్ప సన్యాసివచ్చాడని, ఆతడుభూత,భవిష్యద్వర్తమానాలు చెప్పటంలో దిట్టయని విన్నాడు. అదృష్టదీపుడా సన్యాసిని కలుసుకొని నమస్కరించి తన చేతిహస్తరేఖ చూడమన్నాడు. ఆ సన్యాసి అదృష్టదీపుని హస్తరేఖలు పరిశీలించి “యువకా ! నీవెవ్వరవో నాకు తెలియదుగాని నాజన్మలో నేనింతవరకు ఇంతటి గొప్పచెయ్యి చూడనేలేదు. నీ హస్త రేఖలు చూస్తే నీవిక్కడ ఉండవలసినవాడవుకావు. నీవు అదృష్టదీపుడంతటి పేరు ప్రఖ్యాతులతో వెలుగొందుతావు. ఇంతటి ఉత్తమలక్షణా లున్న చేయిని నేనింతవరకూ చూడలేదు. అదృష్టదీపునివలె నీఖ్యాతి ఖండఖండాంత రాల లోను వ్యాపిస్తుంది. నీవు జగద్విఖ్యాత పురుషుడవవు తావు. నీ తల్లిదండ్రులు కూడా ఇంకా జీవించే ఉన్నారు. నీకొకసోదరుడుకూడా ఉన్నాడు. ఈ భూమండలాన్ని ఏలదగిన మహాచక్రవర్తివి నీవు అని జోస్యం చెప్పాడు. ఇంతలో ఆ దేశ రాకుమార్తె కాంతిమతికూడా తన చెలికత్తెతో సన్యాసి దర్శనార్ధమై వచ్చింది. సన్యాసిమాటలు విని ఓరగా అదృష్టదీపుని చూసింది. ఆతని అందానికి ముగ్ధురాలై పోయింది. చెలికత్తె గమనించింది.
COMMENTS