Adrushta Deepudu Tanasodarini Kalusukonuta Story in Telugu Language : అదృష్టదీపుడు తనసోదరిని కలుసుకొనుట కథ, Kasi Majili Stories in Telugu for kids.
Adrushta Deepudu Tanasodarini Kalusukonuta Story in Telugu Language : In this article read "అదృష్టదీపుడు తనసోదరిని కలుసుకొనుట కథ", "Kasi Majili Stories in Telugu" for kids and Students.
అదృష్టదీపుడు తనసోదరిని కలుసుకొనుట కథ
అదృష్టదీపుడు తన స్నేహితునితో కలిసి దేశాటనం చేస్తూ పుష్పగిరి అనే పట్టణాన్ని చేరాడు. అక్కడ కూడా అదృష్టదీపుని పేరు ప్రఖ్యాతులు మారు మ్రోగ సాగాయి. ఆ పట్నానికి రాజవాహనుడు. రాజుగా ఉంటున్నాడు.
ఒకనాడుఅదృష్టదీపుడు సత్రపుఅరుగుమీదకూర్చొనియుండగా ఒక బ్రాహ్మ ణుడు వచ్చి తదేకంగా చూడసాగాడు. తననే పదే పదే చూస్తున్న ఆ బ్రాహ్మణునితో “అయ్యా! మీరెవరు? అలాపదేపదే నన్నెందుకు చూస్తున్నారు. ఇంతకు ముందెప్పు' డైనా నన్నుచూసారా ! ఏమిటి విశేషం అని అదృష్ట దీపుడడిగాడు. అయ్యా ! నేను మాళవదేశరాజుగారి పురోహితుడ్ని, మాదికోశాంబనగరము. మా రాజు పేరు ధర్మ పాలుడు నన్ను విష్ణుశర్మ అంటారు లెండి. కొన్నాళ్ళక్రితం మా రాజ్యాన్ని శతృరాజులు ముట్టడించి వశపరుచుకున్నారు. నన్ను బ్రాహ్మణుడననీ, దిక్కులేనివాడనీ అనుకొని దేశం నుండి తరిమేశారు. పెద్దసంసారివాడను దేశాటనం చేస్తూ కుటుంబ పోషణగావిస్తున్నాను. అదృష్టదీపుని పేరుప్రఖ్యాతులు విని ఆయన దర్శనం చేసుకొని నా దారిద్ర్యాన్ని బాపుకోవాలని పయనమయ్యాను. -
అదృష్టదీపుడు తన వద్దనున్న కొన్ని వరహాలనిచ్చి "అయ్యా! మీ రాజుగారిని ఓడించిన శతృరాజు పేరేమిటి ? మీ రాజు ధర్మప్రభువుకు భార్యాపుత్రులున్నారా? వాళ్ళేమయ్యారు? అని ఆత్రంగా అడిగాడు. అంతట ఆ బ్రాహ్మణుడు” ఏమని చెప్పను బాబూ ! మా రాజుగారిని ఓడించిన శతృరాజు చోళదేశప్రభువుట మా మంత్రి చేసిన దుర్మార్గపు పన్నాగం వలన మా రాజు ఓడిపోయాడు లేకుంటే మా రాజుగారిని ఓడించే వీరుడున్నాడా ? మా రాజు భార్య సునంద పిల్లవాని నెత్తుకొని దాదితోకలసి అంతఃపురరహస్యమార్గముగుండా ఎక్కడికో పారిపోయింది. నాటినుండిఆమె ఏమైందో? ఆ బాలుడెలా ఉన్నాడో ! వారి జాడ ఏమియు తెలియ లేదు. అదృష్టదీపుడు కావలసిన వివరాలన్నీ ఒక చీటి పై రాసుకున్నాడు.
తన గదిలోనికి చేరుకున్న అదృష్టదీపునికి మరొక ముఖ్యమైన వార్త తెలిసింది. అదేమిటంటే ఆ దేశ రాకుమార్తె అయినప్రియంవద కొన్ని చిక్కు ప్రశ్నలువేస్తున్నదనీ, సమాధానముచెప్పలేని వారిని ఉరితీయించుననీ హరిదత్తుడనే బ్రాహ్మణ యువకుడు సమాధానము చెప్పలేక ఉరికంభ మెక్కుతున్నాడని తెలిసింది. అ బ్రాహ్మణ యువకు డైన హరిదత్తునిలో అదృష్టదీపుని పోలికలు చాలా ఉన్నాయనివిన్నాడు. .
అదృష్టదీపుడు వెంటనే రాజసభకు వెళ్ళి నేను మిత్రగుప్తుడను. నాది కాశి దేశం, రాకుమారి అడిగే చిక్కు ప్రశ్నలకు నేనుజవాబుచెబుతాను. నా కొక 6 నెలలు గడువుఇప్పించండి. ఆ బ్రాహ్మణ యువకుడిని ఉరిబారినుండి తప్పించండి”. అని కోరాడు. ఆరునెలలలో మారాకుమార్తె అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయావో నీతో బాటు హరిదత్తుడు గూడా ఉరితీయబడతాడు. అంగీకారమేనా? అని రాజు అడిగాడు. సరేనని అంగీకరించాడు. అదృష్టదీపుడు. హరిదత్తుని జైల్లో పడవేసారు. రాకుమారి అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పటం కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఇంతలో హరిదత్తుడు జైలునుంచి పారిపోయాడు.
పారిపోయిన హరిదత్తుడు కాంతిమతితండ్రి పంపిన చారులకు చిక్కాడు. హరిదత్తుడు ముమ్మూర్తులా అదృష్టదీపునిపోలికలతో ఉండటంతో అందరూ హరి దత్తుని, అదృష్టదీపునిగానే భావించసాగారు. కాంతిమతి కూడా ఆతడే తన భర్తయను కొనిచూసితిరా మనబాలుని ! వీడుఅచ్చం తనతండ్రినిపోలి ఉన్నాడు. వీనికి జాతక కర్మాదులుచేయాలని, రాజుగారు చూస్తున్నారు. తానుఅదృష్టదీపుడనుకానని హరి దత్తుడెంతమొత్తుకున్నా ఎవరూవినటం లేదు. పైగా మతి భ్రమించిందేమోననుకోసాగారు.
అక్కడ అదృష్టదీపుడు ప్రియంవద అడిగిన చిక్కు ప్రశ్నలకు అతి ప్రయాసతో సమాధానాలు కనుగొని వస్తుంటే జైల్లో నుండి పారిపోయిన హరిదత్తుడితడేనని హరిదత్తుని పోలికలతోను అదృష్టదీపునిబంధించి రాజాస్థానానికి తీసుకుపోయారు. నేను హరిదత్తుణ్ణి కాననిమిత్రగుప్తుడెంతమొత్తుకున్నా ఎవరూవినలేదు. జైల్లో నుండి పారిపోయినందుకు రాజుకు కోపమొచ్చి ఈతన్ని ఉరితీయండి అని అజ్ఞాపించాడు. వెంటనే మిత్రగుప్తుడు మీకుమార్తె అడిగిన ప్రశ్నలకు జవాబులు చెబుతానన్నాడు. అంతటరాకుమారి ఆనాడు నా ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ఉరిశిక్షకు గురైన వీనికింతలో ఎలాతెలుస్తుంది. కావున ఒక కాగితంపై రాసిమ్మని ఆజ్ఞాపించింది.
అంతట మిత్రగుప్తుడు కాగితంపై సరైన సమాధానాలు రాసి ప్రియంవదకు పంపాడు. సమాధానాలు చూసినరాకుమారి ఆశ్చర్యపోయి ఇవి సరైన సమాధానాలే అనినిర్ధారించుకొని. అన్నమాటప్రకారంజవాబులు చెప్పినవానినే పెండ్లి చేసుకుంటా నంది. మిత్రగుప్తుడు నేనొకమారు తన బసకు వెళ్ళదలచానన్నాడు. రాజమర్యాద లతో మిత్రగుప్తుని తీసుకొని వస్తుంటే ఆతని మిత్రుడైన బలబద్రుడు ఎంతగానో సంతోషించాడు. రాజభటులు పోయిన తర్వాత మిత్రులిద్దరూ చర్చించుకో సాగారు. అసలీహరిదత్తుడేమైనట్లు? ప్రియంవదహరిదత్తునకేదక్కాలి.వారిద్దరూ ప్రేమించు కున్నట్లు తెలుస్తోంది. వీళ్ళేమోనన్ను హరిదత్తుడిగా భావిస్తున్నారు? ఇట్లా అనుకుంటూ ఎలాగైనా హరిదత్తుని వెతికి తీసుకురావాలని నిర్ణయించుకొని మిత్రులిద్దరూ చెరోవైపూ బయలు దేరారు.
మిత్రుడైన బలబద్రునకు మార్గమధ్యములో నొక సత్రములో ఇరువురు బ్రాహ్మణులు మాట్లాడుకోవటం వినిపించింది. కాంతిమతిబిడ్డకు జాతకకర్మాదులు చేయ సంకల్పించారని, ఆ ఉత్సవమునకు పోయి సంభావనలు తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. ఒకటవ బ్రాహ్మణుడు :- మరి ఆ మహోత్సవానికి ఏదో ఆటంకము వచ్చిందని విన్నాను. నిజమేనా ? రెండవ బ్రాహ్మణుడు :- నిజమే ! ఆ వచ్చినవాడు నేనీ శిశువుకు తండ్రిని కాను అంటున్నాడట, నేను అదృష్టదీపునికాను అని ఎంతమొత్తుకున్నా వినటంలేదట ఒకటవ బ్రాహ్మణుడు :- అవునా! అయితే అతను తప్పకహరిదత్తుడయి ఉంటాడేమో! రెండవ బ్రాహ్మణుడు :- హరిదత్తుని గురించి నీకెట్లు తెలుసు ఒకటవ బ్రాహ్మణుడు :- కొన్నాళ్ళ క్రిందట నాకొక శిశువు దొరికాడు. ఇంటికి తెచ్చి హరిదత్తుడని నామకరణం చేసాను. మరి కొంతకాలానికి నాకు కూడా ఒక పుత్రుడు కలిగితే నా భార్య హరిదత్తుని ఆనాటినుండి వేరుగా చూడసాగింది. సహించలేని నేను హరిదత్తుని ఒక ఆచార్యుని వద్ద కుదిర్చాను. అక్కడినుండి హరిదత్తుడు కొంతకాలానికి ఎటో వెళ్ళిపోయాడట. రెండవ బ్రాహ్మణుడు :- మరి మీరిప్పుడాతనిని గుర్తుపట్టగలరా ! .. ఒకటవ బ్రాహ్మణుడు :- ఏమో ! హరిదత్తుడుకూడా రాజకుమారుడే అయి ఉండ వచ్చు లేనిచో అదృష్టదీపునికి హరిదత్తునికి ఒకే పోలికలుండడమేమిటి? వారిద్దరూ అన్నదమ్ములై గూడా ఉండవచ్చు. ..
ఈ సంభాషణ విన్న బలబద్రునికి వారిద్దరూ సోదరులేమోననే అనుమాన . మొచ్చింది. సన్యాసి చెప్పినది నిజమవుతున్నదేమో ! అనుకున్నాడు.
ఇంతలో అక్కడకొక వృద్ధురాలువచ్చి " అయ్యా! ఇంతకుముందు హరిదత్తుడు ప్రస్తావన తెచ్చినాయనఏడీ? అనిఅడిగింది. “నీవెవ్వరవు” అని అడిగాడు బలబద్రుడు "నేను ధర్మపాలుని ధర్మపత్నిని సునందను. కోట శతృరాజుల వశమైందని గ్రహించి శిశువునుదాదికిచ్చి ఇద్దరంఅంతఃపురంలోనిరహస్యమార్గంగుండా తప్పించుకొన్నాం. నేను అడవిలోనికి పారిపోయాను దాది బిడ్డతో సహా వేరొక దిక్కుకు పోయింది. నేనెలాపోయి కొన్ని దినములకు ఒక ప్రాంతము చేరితిని అక్కడే నేను రెండవ బిడ్డనుకన్నాను. బిడ్డకు పాలు తీసుకువద్దామని వెళ్ళి తిరిగివచ్చిననాకు బిడ్డకనపడ లేదు. వలవలా ఏడ్చాను. ఇంతకాలానికిమీ ద్వారా వారిద్దరూసోదరులేననిగ్రహించాను. అంతట బలబద్రుడు అదృష్టదీపుడు, హరిదత్తుడు అన్నదమ్ములే. వారిరువురు సునంద రాణిబిడ్డలే. వారితండ్రి ధర్మపాలుడే సందేహం లేదు. అంటూ ఎగిరి గంతే సాడు. వెంటనే రాజాస్థానానికి వెళ్ళి హరిదత్తుని గుర్తించాడు. కాంతిమతికి ఈతడు
నీ మరిది అని చెప్పాడు. హరిదత్తునికంతా వివరించి చెప్పాడు. హరిదత్తుడు తనను పెంచిన బ్రాహ్మణుని గుర్తించాడు.
హరిదత్తుడు అన్నఅగు అదృష్టదీపుని కలవాలని తొందరపడసాగాడు. అంతట బలబద్రుడు తమ సంకేత స్థలమునకు తీసుకొని హరిదత్తుని అక్కడ ఉండమన్నాడు. అక్కడే ఉన్న ప్రియంవదకు హరిదత్తుడీతడే యని ప్రియంవదా హరిదత్తులను కలిపాడు విషయాన్ని వివరిస్తున్నంతలో అదృష్టదీపుడక్కడకు రానే వచ్చాడు. వెంటనే బలబద్రుడు అదృష్టదీపునితో చూసావా ! మిత్రమా ! నీ అనుంగు సోదరుడు,ప్రియంవదను, ప్రేమించినవాడునుఅయినహరిదత్తుని ఎలా తీసుకు వచ్చానో! అంటూపరిచయాలుచేసాడు. అన్నదమ్ములిద్దరూ సంతోషంతో ఆలింగనం చేసుకున్నారు. తనను పెంచిన బ్రాహ్మణునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. హరిదత్తుడు.
ఇంక మనం మన తల్లిదండ్రులనన్వేషించాలి. పద అన్నాడు. అదృష్టదీపుడు “ఆశ్రమం అక్కరలేదు! ఇదుగో ఈ వృద్ధురాలే మీ తల్లి సునందారాణి ! అంటూ బలబద్రుడు పరిచయం చేసాడు. అయితే ఇక మిగిలిన దొక్కటే మన తండ్రిగారైన ధర్మపాలుని శతృరాజు చెరనుండి విడిపించటమే” అన్నారు. అన్నదమ్ములిద్దరూ.
ఇరువురి మామగార్ల సైన్యసహాయంతో చోళదేశపుశతృరాజునోడించి తండ్రిని చెరనుండి విడిపించగలిగారు. వృద్ధులైన ధర్మపాల, సునందలు రాజ్యాన్ని కొడుకులకు అప్పగించి విశ్రాంతి తీసుకోసాగారు. అదృష్టదీపుడు రాజుగాను, హరిదత్తుడు మంత్రిగాను ఉండి చిరకాలం రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించారు. అదృష్టదీపుడు తన రహస్య జీవితం నుండి వెలుగులోనికి వచ్చాడు. కాంతిమతి అదృష్టదీపులకు ప్రియంవధ హరిదత్తులకు రంగరంగ వైభోగంగా వివాహం జరిగింది. దేశ నలుదిక్కుల నుండి రాజులు ఏతెంచి ఆశీస్సులు అందించారు.
ఇలా గురు శిష్యులు కధలు చెప్పకుంటూ కాశీకి సురక్షితంగా చేరారు.
COMMENTS